EX MLA Rachamallu: కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు 14 మంది ఉంటే తెలుగు దేశం పార్టీకి కేవలం 6 మంది వార్డు సభ్యులతో ఉపసర్పంచ్ పదవీ కోసం పోటీ పడ్డారు.. ఉప సర్పంచ్ పదవి కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చి వాయిదా వేశారని పేర్కొన్నారు. అలాగే, వైసీపీ వార్డు సభ్యులపై సైకిల్ పార్టీ నేతలు దాడి చేశారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: CPI Ramakrishna: రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంలో జగన్ను మించిపోయారు..
ఇక, ఎన్నికలు జరిగే కార్యాలయంలో పోలీసుల సమక్షంలో టీడీపీ నేతలు అధికారులపై దౌర్జన్యం చేసిన కేసులు లేవు అని వైసీపీ నేత రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తెలిపారు. పోలీసులను గట్టిగా ప్రశ్నిస్తున్నా.. చట్ట ప్రకారం మాపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేస్తే ఇంత వరకు కేసు నమోదు చేయలేదు అని ఆరోపించారు. మాపై రాళ్ళ దాడి చేయడమే కాక తిరిగి మాపై కేసులు నమోదు చేశారు.. పోలీసుల సహకారంతోనే మాపై దాడులు చేశారన్నారు. జిల్లా ఎస్పీని కలిసి మాకు న్యాయం చేయమని కొరతాం.. మాకు న్యాయం జరగక పోతే కోర్టునూ ఆశ్రయిస్తామని రాచమల్లు వెల్లడించారు.