గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ‘అడవి తల్లి బాట’ పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తిస్థాయిలో రోడ్ల అభివృద్ధికి డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అడుగులు పడనున్నాయి. ఈ నేపథ్యంలో గిరిజన గ్రామాల్లో రెండు రోజులపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో రెండు రోజులపాటు డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. 7వ తేదీ ఉదయం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నేరుగా అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలోని గిరిజన ఆవాసాలను సందర్శించనున్నారు.
Also Read:MK Stalin: ప్రధాని మోడీ కార్యక్రమానికి స్టాలిన్ గైర్హాజరు.. కారణం ఇదే..
అడవి తల్లి బాట పేరిట చేపట్టే రోడ్ల నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. అక్కడే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. 8వ తేదీ ఉదయం అరకు మండలం, సుంకరమిట్టలో పర్యటించనున్నారు. అక్కడ నిర్మించిన ఉడెన్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. తర్వాత అక్కడి నుంచి విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కుకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. అక్కడ ఎకో టూరిజంపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి, ఎకో టూరిజంకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు. గిరిజన గ్రామాల మధ్య అనుసంధాన రోడ్ల అభివృద్ధి, రాష్ట్రంలో ఎకో టూరిజం ప్రోత్సాహంపై పవన్ కళ్యాణ్ ప్రధాన దృష్టిసారించనున్నారు.