Trump Tax Effect On Prawns: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ట్యాక్సులు సముద్రపు రొయ్యలపై పెద్దగా ప్రభావం చూపడం లేదు. బ్రౌన్ 400, టైగర్ 1000 – 1200, వైట్ రొయ్య 500 – 550 రూపాయల మధ్య ధర పలుకుతుంది. ఈనెల 14వ తేదీ నుంచి చేపల వేట నిషేధం అమలులోకి రానుంది. ఇండియన్ మెరైన్ ఇంపోర్టులపై మొదటి నుంచి యూఎస్ సర్కార్ ఆంక్షలు అమలు చేస్తుంది. అయితే, పర్యావరణ భద్రత, బాధ్యత అవలంబించడం లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈక్విడార్ నుంచి పెద్ద ఎత్తున రొయ్యలు, చేపలు దిగుమతి చేసుకుంటుంది అమెరికా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మిడిల్ ఈ స్ట్, యూరోపియన్ దేశాలకు భారీగా ఎగుమతులు అవుతున్నాయి.
Read Also: Kareena kapoor : వారానికి ఐదు సార్లు దాని తినాల్సిందే ..
కాగా, భారత్ నుంచి దిగుమతి అయ్యే రొయ్యలపై అమెరికాలో విదేశీ సుంకం పెంచింది. దీంతో గంటల వ్యవధిలోనే ఆయా కౌంట్లను బట్టి రొయ్యల ధరలు క్రమంగా పడిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కిలో ధర గరిష్ఠంగా 40 రూపాయల వరకు పడిపోయింది. భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న మాంస ఉత్పత్తుల్లో రొయ్యలు మూడో స్థానం ఉంది.