Vizianagaram: విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పెణసాంలో పోలీసుల ఆధ్వర్యంలో రామాలయంలో సీతారాముల కళ్యాణం కొనసాగుతుంది. రామాలయం ప్రారంభమైనప్పటి నుంచి లెంక వారి కుటుంబ సభ్యులే కళ్యాణంలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది. అయితే, ఎప్పుడు ఆ కుటుంబమేనా అంటూ మరో వర్గం పంచాయితీకి దిగింది. దీంతో ఇరు వర్గాలకు చెందిన వారితో చర్చలు జరిపిన జిల్లా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం.. చివరకు ఇరువర్గాల నుంచి చెరొక జంట కూర్చొని కళ్యాణం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 140 మందికి పైగా పోలీసులు మోహరించారు.