CM Chandrababu New House: అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తను కూడా రాజధాని ప్రాంతంలో ఇల్లు నిర్మాణాన్ని తలపెట్టారు.. దీని కోసం గత ఏడాది వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నివాస ప్లాట్‌ను రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేసిన విషయం విదితమే కాగా.. ఈ రోజు ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.. ఇంటి నిర్మాణ ప్రాంతానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులు చేరుకుని.. వేద పండితుల ఆధ్వర్యంలో శంకుస్థాపన పూజా కార్యక్రమం నిర్వహించారు.. భూమి పూజ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి లోకేష్ సతీమణి బ్రాహ్మణి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సచివాలయం వెనుక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం జరగనుంది. రాజధాని కోర్ ఏరియాలో వెలగపూడి పరిధిలో సీఎం చంద్రబాబు నివాసం ఉండనుంది..
Read Also: Tamilisai: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైకి పితృవియోగం
సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం పూర్తయింది. సీఎం తమ ప్రాంతంలో ఇల్లు కట్టు కోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. భూమి పూజ కార్యక్రమం పూర్తయిన తర్వాత సీఎం చంద్రబాబుకు నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఇంటి ప్లాన్ వివరించారు… అధికారిక నివాసం, కాన్ఫరెన్స్ హాల్‌కు సంబంధించి చర్చ జరిగింది.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. అత్యాధునిక హంగులతో సీఎం చంద్రబాబు నివాసం నిర్మాణం జరగనున్నట్టుగా తెలుస్తోంది.. ఇంటి నిర్మాణ ప్లాన్‌ను సీఎంకు నిర్మాణ సంస్థ ప్రతినిధులు వివరించగా.. ఇంటి నిర్మాణ స్థలం చిట్టూ తిరుగుతూ పరిశీలించారు సీఎం చంద్రబాబు.. ఇక ఈ మధ్యే ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు.. 1,455 చదరపు గజాల విస్తీర్ణంలో జీ ప్లస్ 1లో ఇంటిని నిర్మించనున్నారట.. పనులు పూర్తి చేసి ఏడాదిలోపు గృహప్రవేశం చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట..