Ramagiri SI: శ్రీ సత్యసాయి జిల్లాలోని రాప్తాడు నియోజక వర్గంలోని రామగిరిలో టీడీపీ నేతల దాడిలో మణించిన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబ సభ్యులను మంగళవారం నాడు మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ అంటూ సంబోందించారు ఎస్ఐ. పోలీసులను బట్టలు ఊడదీసి కొడత అంటున్నావ్.. యూనిఫాం నువ్వు ఇస్తే వేసుకున్నది కాదు.. కష్టపడి చదివి సాధించింది.. నువ్వెవడో వచ్చి ఊడదీస్తా అంటే ఊడదీయడానికి అరటి తొక్క కాదు అంటూ మండిపడ్డారు. నిజాయితీగా ఉంటాం.. నిజాయితీగా చస్తాం.. అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం అని తెలిపాడు. జాగ్రత్తగా మాట్లాడు అంటూ వైఎస్ జగన్ కు రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ హెచ్చరించాడు.
అయితే, నిన్న రామగిరిలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కొందరు పోలీసులు టీడీపీకి వాచ్ మెన్లుగా పని చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారి బట్టలూడదీస్తాం.. గుర్తు పెట్టుకుని మరీ ఉద్యోగాలు పీకేస్తాం అని హెచ్చరించారు.