Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు “షార్ట్ బ్రేక్” తీసుకున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా తొలకరి మందగించింది. దీంతో వర్షాలు ముఖం చాటేయగా వాతావరణం నిప్పులు కుంపటిగా మారింది. సాధారణం కంటే ఒకటి రెండు డిగ్రీల అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ జనం అల్లాడి పోతున్నారు. తీవ్రమైన ఉక్కపోతలు కోస్తాజిల్లాలను ఉడికెత్తిస్తున్నాయి. కాగా, నైరుతి రుతుపవనాలు 10 రోజుల ముందే పలుకరించిందన్న సంతోషం ఆవి
రైంది. ఊరించి.. హుషా రు తెచ్చిన వానలు ముఖం చాటేశాయి. గత నెల 29 తర్వాత మాన్ సూన్ కరెంట్ మందగమనంలో కి వెళ్ళిపోయింది. అప్పటి వరకు వేగంగా విస్తరించిన ఋతువనలు కదలికలు దక్షిణ భారత దేశం, ఈశాన్య రాష్ట్రాల దగ్గర ఆగిపోయాయి. దీనికి ప్రధాన కారణం వాయువ్య బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం. ఋతుపవనాల విస్తరణకు అవసరమైన తేమ మొత్తం వెళ్లిపోవడంతో పొడి గాలులు వీస్తున్నాయి.
Read Also: RCB Stampede: తొక్కిసలాట ఘటనపై స్పందించిన బీసీసీఐ..
ప్రస్తుతం అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో రుతుపవన కరెంట్ బలహీనంగా వుంది. అది పుంజుకునే వరకు కదలికలు సాధ్యం కాకపోవచ్చని అంచనా. మరో వారం పాటు నైరుతి రుతుపవనాలు పురోగమనం కష్టమేనని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఐతే, ఇదేమీ అనూహ్యమైన పరిణామం మాత్రం కాదు. రుతుపవనాలు విస్తరించేటప్పుడు మధ్యలో కొద్దిరోజుల విరామం సాధారణమేనని వాతావరణ శాఖ చెబుతోంది. ఈనెల 12 తర్వాత తొలకరి విస్తరించడం మొదలయ్యే ఛాన్స్ ఉంది. అప్పటి మాన్ సూన్ కరెంట్ బలం ఆధారంగా వర్షాలు ఆధారపడతాయి. 15ఏళ్ల విరామం తర్వాత నైరుతి రుతుపవనాలు బాగా అడ్వాన్స్ అయ్యాయి. ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం అంచనాలు వున్నాయి. నిర్ధిష్ట కాల ప్రమాణం కంటే ముందుగానే వచ్చి నప్పటికీ విస్తరణ సమయంలో ప్రతికూలత ఏర్పడింది.
Read Also: Vi and Vivo: Vivo V50e వినియోగదారులకు బంపర్ ఆఫర్.. 12 నెలల OTT యాక్సెస్, రోజూ 3GB డేటా..!
ఇక., మాన్ సూన్ ముఖం చాటేయడంతో కోస్తా జిల్లాలు ఉడికెత్తిపోతున్నాయి. సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నప్పటికీ వాతావరణం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఎండల తీవ్రతకు వాతావరణ అనిశ్చితి నెలకొని ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. జంగ మహేశ్వరపురంలో అత్యధికంగా 41డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణమే అయినప్పటికీ ప్రజలకు తారెత్తిపోతోంది. మరో వారం రోజులు ఇదే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయి. మరోవైపు, రాష్ట్రం లో అడపాదడపా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఐతే., ఈ వానలు స్థానిక వాతావరణ పరిస్థితి కారణంగా వచ్చేవే తప్ప రుతువన వర్షాలు కాదని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.