జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేశాడని ఆరోపించారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు.. కానీ, వైసీపీ హాయాంలో తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు యోగాంధ్ర తీర్మానం ప్రవేశ పెట్టారు. రెండు నిమిషాలు మౌనంగా మెడిటేషన్ చేసి తీర్మానాన్ని బలపరచమని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీ యుగంలో ఉన్నాం.. వత్తిడితో ఉన్నాం.. గత ఐదేళ్లలో పార్టీ కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పడ్డారు అని తెలిపారు.
జనసేన పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తూగో జిల్లా సినీ డిస్ట్రిబ్యూటర్, అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత అత్తి సత్యనారాయణ రాజమండ్రిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, ఇదంతా దిల్ రాజు కుట్రలో భాగమని ఆరోపించారు. సినిమా థియేటర్ల బంద్ విషయంలో తన పేరును దురుద్దేశంతో లాగారని, ఈ వివాదం వెనుక దిల్ రాజు, అతని సోదరుడు శిరీష్ రెడ్డి, సురేష్…
కడప వేదికగా టీడీపీ మహానాడు జరుగుతోన్న వేళ.. ఆ పసుపు పండుగపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్.. మహానాడు పెద్ద డ్రామాగా అభివర్ణించిన ఆయన.. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పనిచేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా..? అని ప్రశ్నించారు.
మహానాడు వేదికగా మంత్రి నారా లోకేష్ కు కీలక పదవి ఇవ్వాలని ప్రతిపాదించారు సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర.. లోకేష్కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని మినీ మహానాడులో తాము తీర్మానించామని.. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెప్పారు ధూళిపాళ్ల నరేంద్ర.. పార్టీ నేతలు, శ్రేణులు, అందరూ కోరుకుంటున్న విధంగా లోకేష్ కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరారు నరేంద్ర
ఎన్టీఆర్ స్థాపించిన పసుపు జెండాకు 43 ఏళ్లు.. తెలుగుజాతి మొత్తం ఆరాధించే ఏకైక నేత ఎన్టీఆరే అన్నారు టీడీపీ అధితే, ఏపీ సీఎం చంద్రబాబు.. కడపలో జరుగుతున్న మహానాడులో రెండో రోజు చంద్రబాబు మాట్లాడుతూ.. మళ్లీ జన్మ ఉంటే తెలుగు గడ్డపై పుడతా అన్నారు.. కార్యకర్త నా హై కామెండ్.. కార్యకర్తె సుప్రీం.. తొలిసారిగా 65 మంది యువత కు సీట్లు ఇచ్చాం.. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచారు.. లోకేష్ 6 శాసనాలు ప్రవేశ పెట్టారు.. ఆయనకు ఉన్న…
కడపలో రెండో రోజు టీడీపీ మహానాడు ప్రారంభమైంది.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, డాక్టర్ నందమూరి తారకరామారావు 102వ జయంతి సందర్భంగా సభా వేదికపై ఆయన విగ్రహానికి నివాళులర్పించారు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.. అయితే, మహానాడు వేదికగా ఎన్టీఆర్ ఏఐ ప్రసంగం ఎంతగానో ఆకట్టుకుంది..
తన భర్తపై రౌడీషీటర్లు దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నిస్తే కులసంఘాలు ఎక్కడికిపోయాయని మండిపడ్డారు కానిస్టేబుల్ చిరంజీవి భార్య కళ్యాణి.. గుంటూరు జిల్లా తెనాలిలో కానిస్టేబుల్ చిరంజీవిపై నెల రోజుల క్రితం ఐతానగర్ కు చెందిన రౌడీషీటర్ లడ్డూ అనుచరులు జాన్ విక్టర్, బాబూలాల్, రాకేష్ లు గంజాయి మత్తులో దాడి చేశారు. ఈ ఘటనపై కానిస్టేబుల్ చిరంజీవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మూడు రోజులపాటు జరుగుతున్న మహానాడులో ఆఖరి ఘట్టం భారీ బహిరంగ సభ... ఇది ఇప్పుడు టీడీపీ నేతలకు సవాలుగా మారింది.. ఒకపక్క వర్షాలు.. మరోపక్క మహానాడు నిర్వహణ.. టీడీపీ నేతలకు కత్తి మీద సాముగా మారింది... ప్రతిపక్ష నేత అడ్డాలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న సభను కానీ విని ఎరుగని రీతిలో నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది... అందుకోసం జన సమీకరణ చేయడానికి కడప జిల్లాలోని టీడీపీ నేతలకు టార్గెట్ ఫిక్స్ చేశారట అధిష్టానం..