Off The Record: జోగి రమేష్… మాజీ మంత్రి. వైసీపీ హయాంలో కేబినెట్ మినిస్టర్‌గా ఉండి కూడా… కనీస హుందాతనం లేకుండా తమ నాయకుల మీద విచ్చలవిడిగా నోరు పారేసుకున్నారని, ఆయన చేతలు కూడా అలాగే ఉండేవన్నది టీడీపీ, జనసేన అభియోగం. చంద్రబాబు, లోకేష్, పవన్ మీద హద్దులు దాటి మాట్లాడటమేగాక… బాబు ఇంటి మీద దాడికి ప్రయత్నించిన ఘటనతో పార్టీ హిట్ లిస్ట్‌లో చేరారాయన. ఇక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి కూటమి పవర్‌లోకి వచ్చిన వెంటనే సైలెంటయ్యారు జోగి. చంద్రబాబు ఇంటి మీద దాడికి ప్రయత్నించిన కేసులో ముందస్తు బెయిల్ వచ్చాకే బయటికి కనిపించారాయన. అదే సమయంలో అగ్రిగోల్డ్ భూముల కేసులో ఆయన కొడుకుని అరెస్ట్ చేసింది ఏసీబీ. తర్వాత అతనికి కూడా బెయిల్ వచ్చింది. అలాగే…. దాడి కేసులో మాజీ మంత్రిని విచారణకు పిలిచి ప్రశ్నించి పంపేసింది సీఐడీ. అది జరిగి కూడా చాలా రోజులు కావడంతో.. పోలీసులు ఇక ఆయన జోలికి రాబోరని అనుకున్నారట. ఎపిసోడ్ అక్కడితో ముగిసిపోయిుంది..
Read Also: Off The Record: వైసీపీలో వెన్నుపోటు రాజకీయాలు..! తోపుదుర్తి ఆ మాట ఎందుకన్నారు ?
ఇక, జోగి రమేష్ మీద ఫోకస్ పెట్టకపోవచ్చన్న చర్చలు జరిగాయి ఇటు టీడీపీ, అటు వైసీపీలో. కట్ చేస్తే… తాజాగా జరుగుతున్న పరిణామాలు మాత్రం వదల బొమ్మాళీ వదల అంటున్నాయట. సైలెంట్‌గా ఉన్నంత మాత్రాన సీన్ లేదని అనుకోవద్దన్నట్టుగా మారిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. అగ్రిగోల్డ్ భూముల కేసులో ఇప్పటి వరకు జోగి రమేష్ కుమారుడు రాజీవ్, ఆయన బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు మాత్రమే ఉన్నారు. ఆ కేసులో మాజీ మంత్రి పేరు లేదు. అయితే… ఈ మొత్తం వ్యవహారంపై మళ్ళీ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో…. ఏసీబీ, రెవెన్యూ అధికారులు తాజాగా అగ్రిగోల్డ్ భూముల్లో పూర్తిస్థాయి పరిశీలన జరిపారట. ఉద్దేశ పూర్వకంగానే జోగి రమేష్ ఫ్యామిలీ తప్పుడు సర్వే నంబర్‌తో ధృవీకరణ పత్రాలు సృష్టించి ప్లాటింగ్ చేసి అమ్మేసినట్టు ఆ పరిశీలనలో తేలిందట. అప్పుడు అధికారంలో ఉన్న జోగి రమేష్ తన పవర్‌ను అడ్డం పెట్టుకుని అధికారులను ప్రలోభపెట్టి ఇదంతా చేసినట్టు గుర్తించారట. ప్రభుత్వానికి పంపిన రిపోర్ట్‌లో మాజీ మంత్రి పాత్రను ప్రస్తావిస్తూ…. ఆయన ప్రమేయాన్ని ధృవీకరించినట్టు తెలిసింది.
Read Also: Constable Chiranjeevi: కానిస్టేబుల్ చిరంజీవి కుటుంబాన్ని పరామర్శించిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్
దీనిపై ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవటానికి రంగం సిద్ధమవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. దీంతో…అధికార దుర్వినియోగానికి పాల్పడ్డందుకుగాను అగ్రిగోల్డ్ కేసులో డైరెక్ట్‌గా జోగిని కూడా చేర్చవచ్చన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. ఇక పెడన నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా 2019- 2024 మధ్య పనిచేశారు జోగి రమేష్. అదే సమయంలో ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది. అప్పుడు కృత్తివెన్నులో 30 ఎకరాల పొలం అమ్ముతానంటూ… రమేష్ తన దగ్గర 90 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నారని, కానీ… రిజిస్ట్రేషన్ చేయకుండా వేధిస్తున్నారంటూ… పోలీసులకు ఫిర్యాదు అందింది. తీరా లోతుల్లోకి వెళితే… అది జోగి సొంత భూమి కాదని, ప్రభుత్వ స్థలాన్ని తనదని చెప్పి అమ్ముతానంటూ అడ్వాన్స్ తీసుకున్నట్టు బాధితుడు ప్రసాద్ పోలీస్ కంప్లయింట్ ఇచ్చారట. అలాగే జోగి అనుచరులు అత్యుత్సాహంతో… రోడ్డున పోయే పిల్లాడి దగ్గరున్న సైకిల్ లాక్కుని విరగ్గొట్టిన కేసులో కూడా ఆయన పేరు చేర్చ వచ్చంటున్నారు. వీటితో పాటు మరికొన్ని ఫిర్యాదులు కూడా వస్తాయని చెప్పుకుంటున్నాయి టీడీపీ శ్రేణులు. ఇలా… తాజాగా పరిణామాలతో రమేష్ వ్యవహారాలు ఒక్కొక్కటి తెర మీదకు వస్తుండటంతో ఆయన క్యూలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయవర్గాల్లో. అప్పుడు ప్రశ్నించి వదిలేసినంత మాత్రాన జోగి రమేష్‌ని వదల్లేదని, పిక్చర్ అభీ బాకీ హై అంటున్నారు టీడీపీ లీడర్స్.