CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.. పలు అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్.. ఇక, మంత్రులతో వివిధ అంశాలపై చర్చించారు సీఎం చంద్రబాబు.. ఇదే సమయంలో.. తుని రైలు ప్రమాదం కేసు అంశంపై మంత్రివర్గంలో ప్రస్తావనకు వచ్చిందట.. ప్రతీ జీవోను జాగ్రత్తగా గమనించాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. పొరపాటు జరిగాక సరిదిద్దుకోవడం కంటే.. ముందే జాగ్రత్త పడాలని సీఎం చంద్రబాబు సూచించారు.. ఈ తరహా పరిణామాలు మళ్లీ పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.. అయితే, జరిగిన పొరపాటుకు సీఎంకు క్షమాపణలు చెప్పారు హోంశాఖ కార్యదర్శి..
Read Also: గుండె చికిత్సలో మరో మైలురాయి.. KONAR-MF డివైస్‌కు యూఎస్ పేటెంట్..!
కాగా, తుని రైలు దహనం కేసు రీ ఓపెన్ కోసం జీవో ఇచ్చి 24 గంటలు కూడా గడవక ముందే ఏపీ సర్కార్ మరో జీవోను విడుదల చేసిన విషయం విదితమే.. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌తో 2016 జనవరి 31న తునిలో బహిరంగ సభ నిర్వహించారు. ఆ మీటింగ్ తర్వాత రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. తుని టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లను కాల్చేశారు. రైల్వే ఆస్తులు ధ్వంసం చేశారంటూ విజయవాడ రైల్వే కోర్టులో దాదాపు ఏడేళ్ళు విచారణ జరిగింది. విచారణ తర్వాత ఈ కేసులో నాటి కాపు ఉద్యమ నేత ముద్రగడతో పాటు మరో 41 మందికి సంబంధం లేదని కొట్టేసింది కోర్ట్. అయితే.. ఆ తీర్పు మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం హై కోర్ట్‌లో అప్పీల్‌కు వెళ్ళాలని నిర్ణయిచడం సంచలనమైంది. దీనికి సంబంధించిన జీవో కూడా జారీ అవడం ఒక ఎత్తయితే… 24 గంటలు గడవకముందే దాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు రావడం అంతకు మించిన సంచలనమైంది. తుని కేసును తిరగదోడే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని క్లారిటీ ఇచ్చేసింది ప్రభుత్వం.. కేసును కొట్టేస్తూ.. రైల్వే కోర్ట్ ఇచ్చిన తీర్పును హైకోర్ట్‌లో సవాల్ చేయబోమని కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన విషయం విదితమే..