YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంది.. అయితే, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శిస్తూ.. ‘వెన్నుపోటు దినం’ పేరుతో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు నిర్వహించింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇక, ఈ నిరసన కార్యక్రమంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. సరిగ్గా ఏడాది క్రితం జూన్ 4న చంద్రబాబు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చాడు.. ఇచ్చిన ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు.. చంద్రబాబు తనను నమ్మిన ప్రజలనే మోసం చేశాడు.. అబద్ధపు హామీలతో రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచాడు అని దుయ్యబట్టారు జగన్..
Read Also: CM Chandrababu: తప్పు చేసినవారు తప్పించుకోలేరు.. ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు..
సీఎం చంద్రబాబు తనను నమ్మిన ప్రజలనే మోసం చేశాడు.. అబద్ధపు హామీలతో రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచాడు.. అందుకు నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం పేరిట నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చామని పేర్కొన్నారు జగన్.. నిరసనలకు అన్ని వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో హాజరై మాకు మద్దతు పలికి.. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.. ఇది కేవలం నిరసన మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అబద్ధాలు, మోసాలను భరిస్తూ మౌనంగా ఉండరనే బలమైన సందేశం అని అభివర్ణించారు.. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నిరసనలకు భారీగా హాజరైన ప్రజల బాధ, నిరాశ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. నిరసన కార్యక్రమానికి అండగా నిలిచి పేద ప్రజలతో కలిసి తమ వాణిని వినిపించిన ప్రతీ వైసీపీ నేత, కార్యకర్తలకు, సామాన్య ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలుపై రాబోయే రోజుల్లో పోరాటాలను ఉధృతం చేస్తామంటూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
Exactly a year ago, on June 4, Chandrababu Naidu came to power with grand promises, but not a single one has been fulfilled. Instead, he has betrayed the very people who believed in him. His false statements, broken assurances, and blatant backstabbing have pushed the state into… pic.twitter.com/H5Q80sjqrd
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 4, 2025