Weather Updates : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇవాళ (మే 29) ఉత్తర ఆంధ్ర తీరం దాటి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. రానున్న మూడు రోజుల పాటు వరుసగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. వాతావరణ శాఖ వివరాల ప్రకారం, ఈ వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు…
రాష్ట్రంలో ప్రజలను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వం.. ఈ ఏడాది పాలనలో ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. ఇక, ప్రజల తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు జూన్ 4వ తేదీన రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే, జిల్లా కలెక్టర్లకు, నియోజకవర్గ స్ధాయి అధికారులకు మెమోరాండం సమర్పించాలని సూచించారు.
Rain Alert: నైరుతి ఋతుపవనాలు బుధవారం ( మే 28) నాటికి ఆంధ్రప్రదేశ్ అంతటా పూర్తిగా విస్తరించాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటుగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు.
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు జాతి ఆత్మగౌరవ స్ఫూర్తి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) 102వ జయంతి నేడు ఘనంగా జరిగింది. తెలుగు ప్రజలు ఈ రోజును సందడిగా జరుపుకున్నారు. హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్లో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయన జయంతిని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో సినీ ప్రముఖులు, అభిమానులు, రాజకీయ నాయకులు పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ…సీనియర్ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ…
పంచభూతాలలో ఒకటైన నీటి ఆవశ్యకతను, ప్రాధాన్యతను ఆనాడే మన పార్టీ అగ్రనేతలు గమనించారని అన్నారు. జల వనరులు ఉన్నచోటే నాగరికతలు వెల్లి విరుస్తాయనే చారిత్రక సత్యాన్ని మన పార్టీ ఆవిర్భావ దశలోనే గుర్తించింది.. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై మన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పని చేస్తుందని మంత్రి నిమ్మల పేర్కొ్న్నారు.
Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్లీన్ ఎనర్జీ- గ్రీన్ ఎనర్జిటిక్ స్టేట్ గా క్రియేట్ చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. గ్రీన్ ఎనర్జిటిక్ అప్పుగా మారబోతుంది.. కరెంట్ ఛార్జీలు పెంచను అని ఆ రోజే చెప్పాను దానికి నేను కట్టుబడి ఉన్నాను అని ఆయన పేర్కొన్నారు.
CM Chandrababu: మహానాడులో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొంత మంది ప్రత్యర్థులతో చేతులు కలిపి మన మధ్య కోవర్టులుగా ఉంటున్నారు అని ఆరోపించారు. వాళ్ళ ప్రోత్సాహంతో హత్యా రాజకీయాలు చేస్తున్నారు అని పేర్కొన్నారు. ఇప్పుడు నేను ఎవరినీ నమ్మడం లేదు.. ఇలాంటి తప్పుడు పనులు చేసే ఏ కార్యకర్తను కూడా వదిలి పెట్టనని హెచ్చరించారు.
YS Avinash Reddy: తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో మహానాడుపై రాష్ట్ర ప్రజలు ఎన్నో అశలు పెట్టుకున్నారు అని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. రాయలసీమ అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా లేదు.. ఆత్మస్తుతి పరనింద తప్ప మహానాడులో ఏం లేవు.. వందల కోట్లు ఖర్చు చేసి భారీ సెట్టింగులు వేసి భజన చేసుకున్నారని ఎద్దేవా చేశారు.
Yuva Galam Padayatra Book: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినే, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనపై గళమెత్తుతూ తాను చేపట్టిన యువగళం పాదయాత్ర విశేషాలతో రూపొందించిన పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి అందజేశారు మంత్రి నారా లోకేష్.
జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేశాడని ఆరోపించారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు.. కానీ, వైసీపీ హాయాంలో తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి.