Yemmiganur: ఎమ్మిగనూరు టీడీపీలో చల్లారని మంటలు.. నేతల రాజీనామా బాట..!
- కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీలో వింత పరిస్థితి..
- ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డికి వ్యతిరేక వర్గం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yemmiganur: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. పార్టీ నేతలు, క్యాడర్ అంతా ఒకే బాట, ఒకే మాట. ఇపుడు ఆ పరిస్థితి లేదు.. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డికి వ్యతిరేక వర్గం పుట్టుకొచ్చింది. ప్రతీ సందర్భంలోనూ ఆయన్ను టార్గెట్ చేయడంతో పార్టీలో అసంతృప్తి బయటపడింది. పార్టీకి నిత్యం వెన్నంటి వుండే ద్వితీయ శ్రేణి టీడీపీ సీనియర్ నాయకులంతా సైలెంట్ అయిపోవడం, కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు పెత్తనం చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చర్చించుకుంటున్నారు.
Read Also: Bunny Vasu: కొట్టుకోవడం కాదు.. పెద్ద హీరోలు ఆలోచించాలి!
Also Read
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో టీడీపీ ఫ్లోర్ లీడర్ దయాసాగర్ పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. దయాసాగర్ బీజేపీ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. అలాగే నందవరంలో మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ కూడా పార్టీ కార్య కలాపాలకు దూరంగా ఉన్నారు. ఎమ్మిగనూరులో మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి మరణం తరువాత ఆయన తనయుడు బీవీ జయనాగేశ్వర్ రెడ్డికి టీడీపీ క్యాడర్ బ్రహ్మరథం పట్టింది. కానీ, క్రమంగా టీడీపీ క్రియాశీల నేతలకు, బీవీ జయనాగేశ్వర్ రెడ్డికి గ్యాప్ పెరుగుతోంది. దీనికి కారణం సొంతపార్టీ వారిని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడమేనని చర్చించుకుంటున్నారు. గతంలో జడ్పీ వైస్ చైర్మన్ పుష్పవతిని కూడా అసమ్మతి ముద్ర వేసి సస్పెండ్ చేయించారన్న ఆరోపణ ఉంది. అయితే ఎమ్మెల్యే కూడా తనను కొందరు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ గొడవలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయన్నది చూడాలి.
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?