Maoist Special Story : ప్రశ్నార్థకంగా మావోయిస్టుల భవితవ్యం..!
- మావోయిస్టు పార్టీ నానాటికి ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది
- పార్టీ అగ్ర నాయకులను కోల్పోతుంది
- పార్టీ కేంద్ర నాయకత్వం పట్టు తప్పు పోతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoist Special Story : మావోయిస్టు పార్టీ నానాటికి ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది ..పార్టీ అగ్ర నాయకులను కోల్పోతుంది.. పార్టీ కేంద్ర నాయకత్వం పట్టు తప్పు పోతుంది.. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్కౌంటర్లో చనిపోగా ఇప్పుడు కిందిస్థాయి వాళ్లు కూడా ఎన్కౌంటర్లో చనిపోతున్నారు.. బతికున్న వాళ్లు చాలామంది లొంగిపోతున్నారు. మావోయిస్టు పార్టీ ఏర్పడిన వారు 44 మందితో కేంద్ర కమిటీ ఏర్పాటు అయింది ఇప్పుడు ఆ సంఖ్య 16కు తగ్గిపోయింది ఇందులో ఉన్నవాళ్లు చాలామంది ఎన్కౌంటర్లో చనిపోగా కొందరు వృద్ధాప్యంతో మృతిచెందారు.. ఆపరేషన్ కగార్ మొదలుపెట్టిన తర్వాత మావోయిస్టులకు ఊహించని విధంగా దెబ్బ తలుగుతుంది.. మావోయిస్టు కేంద్ర కమిటీల సభ్యులను టార్గట్టుగా చేసుకుని భద్రత బలగాలు కూబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవ రావు తో పాటు 26 మంది మృతి చెందిన ఘటన మరిచిపోక ముందే మరొక అగ్ర నాయకుడిని మావోయిస్టు పార్టీ కోల్పోయింది ..చర్చల సందర్భంగా కీలక పాత్ర పోషించిన సుధాకర్ అలియాస్ సింహాచలంని బీజాపూర్ లోని నేషనల్ పార్క్ అడవుల్లో మృతి చెందారు ..బీజాపూర్ లోని నేషనల్ పార్క్ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో సుధాకర్ మరణించినట్లు భద్రత బలగాలు పేర్కొన్నాయి ..అయితే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుల టార్గెట్ గానే ఈ కోబింగ్ ఆపరేషన్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు ..మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు అయిన గణేష్ తో పాటు సుధాకర్ మరికొంతమంది కీలక సభ్యులు సమావేశం అయ్యారని సమాచారంతో నేషనల్ పార్క్ నుంచి కూలింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు ..ఈ ఆపరేషన్ పూర్తి అయ్యేసరికి సుధాకర్ చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.. అయితే మిగతా వాళ్ళు ఈ సంఘటన స్థలం నుంచి పారిపోయి ఉంటారని అధికారులు చెప్తున్నారు..
బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన నర్సింహాచలం అలియాస్ సుధాకర్‌తో కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకూ నలుగురు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు కూడా ఉన్నారు. 2004లో నాటి పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ కలిసి మావోయిస్టు పార్టీగా ఏర్పడినపుడు 42 మందితో కేంద్రకమిటీ ఏర్పాటైంది. ఈ 21 ఏళ్లలో జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లు, సహజమరణాలతో కేంద్ర కమిటీలోని సభ్యుల సంఖ్య 16కి తగ్గిపోయింది. జనతన సర్కార్ పేరుతో సమాంతర ప్రభుత్వాన్ని నడిపింది. అబూజ్‌మడ్ వంటి కంచుకోటలను ఏర్పాటు చేసుకుని నాయకులను, క్యాడర్‌ను కాపాడుకుంది. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం సాగిస్తున్న ఆపరేషన్ కగార్‌తో ఆ పార్టీ శ్రేణులు చెల్లాచెదరయ్యారు. వరుసగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లలో భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది జనవరిలో ఛత్తీ్‌సగఢ్, ఓడిశా సరిహద్దుల్లోని కుల్హదీఘూట్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడైన రామచంద్రారెడ్డి అలియాస్ జయరాం, అలియాస్ చలపతి మరణించారు. ఆ తర్వాత మే నెలలో బీజాపూర్ జిల్లా ఉసూర్ సమీపంలోని లంకపల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న మరణించారు. అదే నెలలో నారాయణపూర్‌లో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో ఏకంగా మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ప్రాణాలు కోల్పోయారు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
మావోయిస్టు పార్టీ చరిత్రలో ఎన్‌కౌంటర్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శి మరణించటం ఇదే ప్రథమం. తాజాగా గురువారం బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో కేంద్ర కమిటీ సభ్యుడు, ఏపీకి చెందిన తెంటు నర్సింహాచలం అలియాస్ సుధాకర్ చనిపోయారు. వైయస్సార్ ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో సుధాకర్ రామకృష్ణ గణేష్ కీలకపాత్రలు పోషించారు.. ఈ విధంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు ఎన్‌కౌంటర్లలో మరణించారు. కేంద్ర కమిటీలో ప్రస్తుతం 16 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో ఏపీ, తెలంగాణకు చెందిన వారు 11 మంది ఉన్నారు.., జార్ఖండ్‌కు చెందినవారు ముగ్గురు, ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన వారు ఇద్దరున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన వారు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోనూ, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కోసా, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి, మోడెం బాలకృష్ణ, పాక హన్మంతు అలియాస్ ఊకే గణేష్, కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజుదాదా, గాజర్ల రవి అలియాస్ ఉదయ్, పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, పోతుల కల్పన.
జార్ఖండ్‌కు చెందిన వారు మిసిర్ బెస్రా అలియాస్ సునీల్, అనల్ దా అలియాస్ పాతిరాం మాంజీ, సహదేవ్ అలియాస్ అనూజ్. ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన వారు మాజ్జీదేవ్ అలియాస్ రాంధీర్, మాడ్వి హిడ్మా. వీరిలో 60 ఏళ్లకు పైబడినవారే ఉన్నారు.. ఇందులో చాలామంది కూడా వృద్ధా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. చాలామంది దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారు ఇందులో చాలామంది నడవలేని స్థితిలో కూడా ఉన్నారు.. కేశవరావు చనిపోవడంతో ఆ స్థానంలో ఎవరిని కేంద్ర కమిటీ నియమిస్తుందనే దానిమీద ఒక ఉత్కంఠ నెలకొంది. ఇందులో తెలుగు వాళ్ళకే మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి పదవి వస్తుందని అందరూ అనుకుంటున్నారు. దీనికి సంబంధించి అటు నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి ..కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి ఎవరు అనేదానిమీద ఇప్పుడు చర్చ నడుస్తుంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!