CM Chandrababu: జలవనరుల శాఖపై సమీక్ష.. సీఎం కీలక ఆదేశాలు..
- కృష్ణా-గోదావరి డెల్టాకు తక్షణం నీరివ్వండి..
- తుఫాన్లు ముప్పు తప్పేలా పంట కాలం ముందుకు జరగాలి..
- శాస్త్రీయంగా వాటర్ ఆడిటింగ్-వాటర్ మేనేజ్మెంట్..
- 365 రోజులు పంటలతో పచ్చగా ఉండాలి..
- జలవనరుల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: కృష్ణా, గోదావరి డెల్టాలో పంటల సాగు వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాన్లు కంటే ముందుగానే పంటలు చేతికొచ్చేలా పంటల సాగు కాలంలో మార్పులు తీసుకురావాలని సూచన చేశారు. భూగర్భ జలాలు పెంచడం, రిజర్వాయర్లు నింపడం, జలవనరుల సమర్ధ వినియోగం.. ఈ 3 అంశాలపై అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించారు. 365 రోజులు భూమి పచ్చగా ఉండేలా… 3 పంటలు నిరంతరం పండించేలా చూడాలన్నారు. భూగర్భ జలాల వివరాలు తెలుసుకునేందుకు ఉపయోగించే పిజియో మీటర్లు, రాష్ట్రంలో కొన్ని చోట్ల పనిచేయకపోవడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు..
Read Also: Dulquer Salmaan : రెండు డిజాస్టర్ నుంచి తప్పించుకున్న దుల్కర్..
Also Read
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
- CRDA: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్..! గ్రామకంఠం మినహాయింపులపై CRDA క్లారిటీ..
- Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
ఇరిగేషన్ పై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. . తక్షణం నూతన పరికరాలు కొనుగోలు చేసేందుకు రూ.30 కోట్లు విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చారు. నిర్వహణా లోపాలు సరిచేసుకుని వాటర్ ఆడిట్ శాస్త్రీయంగా చేపట్టాలని చెప్పారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర సహా రాష్ట్రంలో నిర్మించాల్సిన అన్ని ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు. జలవనరుల లభ్యతను బట్టి నీటి సమర్ధ వినియోగం జరగాలన్నారు సీఎం .. భూగర్భ జలాలు 20 మీటర్ల కన్నా తక్కువ ఉన్న మండలాలు, 8-20 మీటర్ల మధ్య భూగర్భ జలాలు ఉన్న మండలాల వివరాలు అందించాలన్నారు. బేసిన్లు, జిల్లాల వారీగా, సెంట్రల్-లోకల్ బులిటెన్లు రిలీజ్ చేయాలని.. రాష్ట్రంలో సగటు భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు సీలేరు నీరు కృష్ణా డెల్టాకు వినియోగించే అంశాన్ని పరిశీలించాలని… హంద్రీ-నీవా మెయిన్ కెనాల్ వైడనింగ్ పనుల్లో వేగం పెంచాలి. వెలిగొండ స్టేజ్ 1 పనులు 2026 జూన్ కల్లా పూర్తి కావాలన్నారు .
Read Also: Dulquer Salmaan : రెండు డిజాస్టర్ నుంచి తప్పించుకున్న దుల్కర్..
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి అటవీ-పర్యావరణ అనుమతులు, డీపీఆర్ ఆమోదం తదితరాలు అన్నీ అనుకున్న సమయానికల్లా జరగాలని, భూసేకరణకు కూడా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టాలని చెప్పారు. అలాగే, టెండర్లకు సంబంధించిన రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీతో డ్రాఫ్ట్ డాక్యుమెంట్ రూపొందించడం, సాంకేతిక నిపుణల పర్యవేక్షణ అనంతరం టెండర్లు పిలవడం ఈ నెలాఖరు కల్లా పూర్తి కావాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.. జలహారతి కార్పొరేషన్ కింద పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుండగా, దీనికోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ఇప్పటికే ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్ధిక వనరుల సమీకరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం ప్రతిపాదనలు పంపించింది. మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే రూ.81,900 కోట్ల వ్యయంలో 50 శాతం అంటే రూ.40,950 ఈఏపీ రుణంగా పొందాలని నిర్ణయించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ గ్రాంట్‌గా 20 శాతం నిధులు రూ.16,380 కోట్లు సమకూర్చుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీగా 10 శాతం నిధులు రూ.8,190 కోట్లు, హ్యామ్ విధానంలో మరో 20 శాతం నిధులు రూ.16,380 కోట్లు ఖర్చు చేయనున్నారు. .
Read Also: Telangana BJP : అభయ్ పాటిల్ కు బీజేపీ హైకమాండ్ ఫుల్ క్లారిటీ..?
మరోవైపు పోలవరం ప్రాజెక్టు సివిల్ నిర్మాణం పనులు ఇప్పటివరకు 81.70 శాతం పూర్తయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కేవలం 3.84 శాతం పనులు మాత్రమే చేయగా, 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల కాలంలో 5.93 శాతం పనులు జరగడం విశేషం. డయాఫ్రమ్ వాల్ 64 శాతం, బట్రెస్ డ్యామ్ 91 శాతం, ఇసుక గట్టి పరిచే వైబ్రో కంప్రాక్షన్ పనులు 54 శాతం పూర్తయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికల్లా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి కానుంది. మరోవైపు, పోలవరం ప్రాజెక్టు పనులు అనుకున్న సమయానికి పూర్తయ్యేలా కాంట్రాక్టర్లతో చర్చించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
తాజావార్తలు
-
ENG vs SL: శ్రీలంకకు చుక్కలు చూపించిన ఇంగ్లాండ్.. సిరీస్ కైవసం..!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
Bank Strike Update: మూడు రోజుల సమ్మె వాయిదా.. కీలక కమిటీ ఏర్పాటు.. బ్యాంకులకు ఇక 5 రోజుల పని విధానమా?
-
Astrology: సెప్టెంబర్ 28 సోమవారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బులే డబ్బులు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
ట్రెండింగ్
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!