Shining Stars Awards: ఉత్తమ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు.. మార్గదర్శకాలు విడుదల
- విద్యార్థులను ప్రోత్సహించే సర్కార్ కీలక నిర్ణయం..
- 2024-25 ఉత్తమ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు..
- టెన్త్, ఇంటర్ లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు అవార్డులు..
- మార్గదర్శకాలు విడుదల చేసిన ఏపీ పాఠశాల విద్యాశాఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shining Stars Awards: విద్యార్థులను మరింత ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అందులో భాగంగా 2024-25 విద్యాసంవత్సరానికి గానూఉత్తమ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.. టెన్త్, ఇంటర్ లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ షైనింగ్ స్టార్స్ అవార్డులు అందించనున్నారు.. ఇక, షైనింగ్ స్టార్ అవార్డులు ఇచ్చేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది ఏపీ పాఠశాల విద్యాశాఖ.. క్వాలిటీ ఎడ్యుకేషన్ ను ప్రోత్సహించేందుకు ప్రోత్సాహక అవార్డులు ఇస్తున్నట్లు పేర్కొంది ప్రభుత్వం.. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ల సిఫార్సుల మేరకు 2024-25 ఏడాదికి జిల్లా స్థాయిలో అవార్డుల ప్రదానం కార్యక్రమం నిర్వహించనున్నారు.. ఈ నెల 9వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ అవార్డులు ప్రదానం చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది..
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
ఈ అవార్డుల ప్రదానంతో.. పదో తరగతి, ఇంటర్మీడియట్ చదివే ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు సర్టిఫికెట్, మెడల్, నగదు ప్రోత్సాహకం అందించనున్నట్లు వెల్లడించింది విద్యాశాఖ.. పదోతరగతిలో 500 మార్కులు లేదా 83.33 శాతం, ఆపై మార్కులు సాధించిన ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు మండలాల వారీగా అవార్డులకు ఎంపిక చేసి.. ఆ అవార్డులను అందించనున్నారు.. ఇక, ఇంటర్ లో 830.. ఆపై మార్కులు సాధించిన ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు జిల్లాల వారీగా ఎంపిక చేసి అవార్డులు అందజేయనున్నారు.. ప్రతి మండలంలో మొత్తం ఆరుగురు ఉత్తమ విద్యార్థులకు ఈ అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ప్రతి మండలంలో ఇద్దరు ఓసీ, ఇద్దరు బీసీ, 1 ఎస్సీ, 1 ఎస్టీ విద్యార్థులకు అవార్డులు ఇస్తారు.. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రతి జిల్లాకు 36 అవార్డుల చొప్పున అందివ్వాలని నిర్ణయం తీసుకున్నారు.. అవార్డుకు ఎంపికైన టెన్త్, ఇంటర్ విద్యార్థులకు సర్టిఫికెట్, మెడల్‌తో పాటు 20 వేల నగదు అందించాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం..
Read Also: Mithra Mandali: మ్యాడ్ నెస్ ఇప్పుడే మొదలైంది.. ఆకట్టుకుంటున్న ‘మిత్ర మండలి’ ఫస్ట్ లుక్
కాగా, ఇప్పటికే మంచి మార్కులు సాధించిన విద్యార్థులతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి.. విద్యార్థులను అభినందించిన విషయం విదితమే.. స్కూళ్లలో ఉన్న సమస్యలపై కూడా ఈ సందర్భంగా ఆరా తీశారు మంత్రి.. అంతేకాదు.. ఉన్నత చదువుల కోసం మీకు మేం అండగా ఉంటామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివి రాష్ట్ర స్థాయిలో టాపర్లుగా నిలిచిన 52 మంది విద్యార్థులను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందించి, సత్కరించారు. షైనింగ్ స్టార్స్-2025 కార్యక్రమం ఉండవల్లిలోని మంత్రి నివాసంలో జరిగింది, ఈ కార్యక్రమంలో లోకేష్ విద్యార్థులకు బంగారు పతకాలు మరియు ల్యాప్‌టాప్‌లను అందజేసిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!