Benefits of Fish: మృగశిర కార్తె రోజే చేపలు ఎందుకు తింటారు? ఎన్ని లాభాలో తెలుసా?
- మృగశిర కార్తె ప్రవేశం రోజున చేపలకు ఎక్కువగా గిరాకీ
- ప్రతి ఒక్కరూ ఈ రోజున చేప ముక్క ఒక్కటైనా తినాలట
- ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి.. అవేంటో చూద్దాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మృగశిర కార్తె ప్రవేశం రోజున చేపలకు ఎక్కువగా గిరాకీ ఉంటుంది. మామూలు రోజుల కంటే ఈ రోజున ఎక్కువగా చేపలు అమ్ముడు పోతాయి. ప్రతి ఒక్కరూ ఈ రోజున చేప ముక్క ఒక్కటైనా తినాలని చెబుతారు. ఇందుకు కారణాలు ఉన్నాయి. మామూలుగానే చేపలు తినడం వల్ల అనేక ప్రయజనాలు ఉన్నాయి. మరి ఈ రోజున తింటే ఇంకెన్ని లాభాలో తెలుసుకోండి.. మృగశిర కార్తె మొదటి రోజు చేపలు తినాలన్నది మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. చేపలను ఇంగువ, చింతపండు లేదా చింత చిగురు కలిపి వండుకుని తినేవాళ్లు. ఇలా తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్నది వారి నమ్మకం. మృగశిర కార్తెలో కలిగే వ్యాధుల నుంచి చేపల్లోని పోషకాలు రక్షణ కల్పిస్తాయని వారి భావన. గుండెజబ్బుతో ఉన్న వారు కచ్చితంగా చేపల్ని తినాలని చెబుతారు. వీటిల్లో 20రకాల ప్రొటీన్లు ఉంటాయి, అవన్నీ చాలా సులువుగా అరుగుతాయి. అలాగే మనకెంతో అవసరమైన అమైనో ఆమ్లాలు కూడా లభిస్తాయి. లైసీన్, సిస్టీన్, మిథియోనిన్ అందులో ముఖ్యమైనవి. చేపల్లో దొరికే కొవ్వు కూడా మనకు అవసరమైనది. గర్భిణీలకు, గుండె జబ్బులు ఉన్నవారికి, పిల్లలకు ఈ కొవ్వు చాలా అవసరం. దీంతోనే చేప నూనెలను తయారు చేసి బయట అధిక ధరలకు అమ్ముతారు. ఈ కొవ్వులోనే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. దీని ద్వారా విటమిన్ ఎ, డి, ఇ లు శరీరానికి అందుతాయి. ఆకుకూరల్లో లభించే విటమిన్ ఎ కన్నా చేపల్లో దొరికే విటమిన్ ఏ అధికం. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. అలాగే కేవలం సూర్య రశ్మి ద్వారా మాత్రమే దొరికే విటమిన్ డి, చేప కొవ్వులో కూడా లభిస్తుంది.
READ MORE: Fish Prasadam: మృగశిర కార్తె రోజే చేపమందు ప్రసాదం ఎందుకు పంపిణీ చేస్తారు..?
Also Read
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
చేపల వేపుడు తింటారో, పులుసు చేసుకుంటారో లేక బిర్యానీ చేసుకుని తింటారో మీ ఇష్టం, ఎలా తిన్నా చేపల వల్ల లాభమే కానీ నష్టం లేదు అని వివరిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. చేపల్లో ఇనుము అధికంగా లభిస్తుంది. దీని వల్ల శరీరంలో రక్తం అధికంగా ఉత్పత్తి అవుతుంది. చేపల్లో అయోడిన్ కూడా దొరుకుతుంది. ఇది గాయిటర్ అనే జబ్బు రాకుండా అడ్డుకుంటుంది. మెదడు పనితీరుకు ఇది చాలా అవసరం. పిల్లల్లో మానసిక ఎదుగుదలకు అయోడిన్ సహకరిస్తుంది. కాబట్టి పిల్లలకు చేపలు తినిపించాలి. చర్మ సమస్యలు రాకుండా అడ్డుకోవడంలో కూడా చేపలు ముందుంటాయి. వీటిలో ఉండే జింక్ కొన్ని రకాల ఎంజైమ్‌లు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఆ ఎంజైమ్‌లు చర్మాన్ని సంరక్షిస్తాయి. పెద్ద చేపల్లోని ముల్లును తినలేం కానీ చిన్న చేపల్లోని ముల్లును తినేయగలం. ఆ ముళ్లతో సహా తినడం వల్ల ఇనుము, కాల్షియం, భాస్వరం వంటివి దొరుకుతాయి.
READ MORE: Karnataka: ప్రియుడి మోజులో పడి భర్తకు అన్నంలో విషం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
తాజావార్తలు
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!