YS Jagan: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన.. ఆదాయం ఏకంగా 24.20 శాతం తగ్గింది..!
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైఎస్ జగన్ ఆందోళన..
- గత ఏడాదితో పోల్చితే రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది..
- ఏకంగా 24.20 శాతం తగ్గింది అంటూ ట్వీట్..
- కాగ్ నివేదికలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్న జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. గత ఏడాదితో పోల్చితే రాష్ట్ర ఆదాయం ఏకంగా 24.20 శాతం తగ్గింది అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది.. కాగ్ నివేదికలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు జగన్.. గత ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా 3,354 కోట్లు ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటన చేసింది.. కానీ, ఇది అబద్దమని కాగ్ నివేదిక వాస్తవ లెక్కలను ప్రకటించిందన్నారు.. 2024 ఏప్రిల్ తో పోల్చితే 2025 ఏప్రిల్ లో ప్రభుత్వ ఆదాయం ఏకంగా 24.20 శాతం తగ్గింది.. ఈ వాస్తవాలను కాగ్ నివేదిక బయట పెట్టగానే ప్రభుత్వ కుట్రపూరితంగా వ్యవహరించింది. ఏప్రిల్ విషయాలు చెప్పకుండా మే నెలలో జీఎస్టీ ఆదాయాలు రికార్డు స్థాయిలో పెరుగుతాయంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తుందని దుయ్యబట్టారు..
Read Also: CM Chandrababu: వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు.. సీఎం సీరియస్ వార్నింగ్
Also Read
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
- CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇక, సర్దుబాటు కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన 796 కోట్ల రూపాయలు తగ్గిందనీ, అందువలన జీఎస్టీ ఆదాయాలు తగ్గాయని ఏపీ ప్రభుత్వం ప్రకటించిందని విమర్శించారు వైఎస్ జగన్.. నిజానికి సర్దుబాట్లన్నీ లెక్కించిన తర్వాతనే నికర జీఎస్టీని లెక్కగడతారు. కానీ, జీఎస్టీ ఆదాయాల గురించి కాగ్ నిజాలను వెలుగులోకి తేగానే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలను చేస్తోందని ఆరోపించారు.. టీడీపీ ప్రభుత్వం చెప్పేదానికి పూర్తి విరుద్దంగా కాగ్ నివేదికలు వాస్తవాలను వెల్లడి చేస్తున్నాయి. దాన్ని బట్టి చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉందన్నారు జగన్.. గతేడాదితో పోల్చితే పన్ను ఆదాయాలు 12.21 శాతం తగ్గాయి.. పన్నేతర ఆదాయాలు 22.01 శాతం తగ్గాయని గణాంకాలు బయటపెట్టారు.. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరింత ఆందోళన కలిగించే అంశం అంటూ.. 2024 ఏప్రిల్.. 2025 ఏప్రిల్‌కు సంబంధించిన రెవెన్యూ, జీఎస్టీ వసూళ్లకు సంబంధించిన కాగ్ పట్టికలను కూడా జత చేస్తూ ట్వీట్ చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..
April 2025 fiscal performance indicates further distress
The CAG uploaded the Monthly Key Indicators for April 2025 and these figures bring to light a very disturbing picture regarding the State finances.
On 1st May, the Government made a press release suggesting that the… pic.twitter.com/oGwLzKXzQZ
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 7, 2025
తాజావార్తలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!