ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం ఆదివారం నాడు సాయంత్రం 4గంటలకి అమరావతిలో జరగనుంది. ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ నేతృత్వం వహించబోతున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సుమారు 35 మంది ప్రముఖులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు, దర్శకులు, నటులు, నటీమణులు పాల్గొననున్నారు. ఈ భేటీలో సినిమాల్లో తమకు ఎదురవుతున్న సమస్యలు, ఏపీలో షూటింగ్లకు పర్మిషన్, లొకేషన్ సమస్యలు, పన్నుల విధానం, సినీ పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబుతో సినీ పెద్దలు సమావేశం కావడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు సినిమావాళ్లు సీఎంను కలవకపోవడంతో ఇటీవల పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. అలాగే, ఏపీలో థియేటర్ల పరిస్థితి.. సదుపాయాలకు సంబంధించిన డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలని ఇటీవల సినిమాటోగ్రఫీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రంగంలోకి దిగిన అధికారులు.. థియేటర్ లలో తనిఖీలు చేపట్టారు.
సమావేశంలో పాల్గొనే ప్రముఖులు
ఈ సమావేశంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అగ్రశ్రేణి వ్యక్తులు పాల్గొననున్నారు. వారిలో కొందరు:
నిర్మాతలు:
దర్శకులు:
నటులు:
నటీమణులు: