మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అంబటి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యిందన్నారు. చంద్రబాబు ఏడాది పాలన సందర్బంగా పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు.. డప్పు కొట్టుకునే కార్యక్రమాలు చేశారు.. సూపర్ సిక్స్ చేసేశాం అంటున్నారు.. సూపర్ సిక్స్ లో ఏం అమలు చేశారో అర్దం కాలేదు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరికీ 15వేలు ఇచ్చామన్నారు. తల్లికి వందనం పేరుతో 30లక్షలమందికి ఎగనామం పెట్టారని మండిపడ్డారు.
Also Read:Air India: ఎయిర్ ఇండియా ఎప్పుడు ప్రారంభమైంది? దాని పూర్తి చరిత్ర ఇదే..
గతంలో జగన్ చేసినట్లే మీరు ఫాలో అయ్యారు కదా.. పచ్చి అబద్దాలు కూడా సిగ్గులేకుండా చెబుతారు చంద్రబాబు, లోకేష్.. చంద్రబాబు, లోకేష్ ప్రకటనల్లో వత్యాసం ఉంది.. జగన్ కంటే ఎక్కువ ఇస్తారని జనం మీకు ఓట్లేసి ఇప్పుడు అనుభవిస్తున్నారు.. జగన్ ఇచ్చిన దాంట్లో సగం కూడా చంద్రబాబు ఇవ్వలేదు.. రూ. లక్షా 58వేల 450కోట్లు అప్పు చేశారు చంద్రబాబు.. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్న చంద్రబాబు ఇప్పుడు ఏం చెబుతారు అని ప్రశ్నించారు. రికార్డు స్థాయిలో అప్పులు చేస్తూ అభివృద్ధి అంటూ అబద్దాలు చెబుతున్నారు అని మండిపడ్డారు.
Also Read:Tollywood : ఫాదర్ సెంటిమెంట్‌తో వచ్చిన.. టాలీవుడ్ బెస్ట్ మూవీస్
వైసీపీ నుంచి నాలుగు పేజీల మానిఫెస్టో రిలీజ్ చేశాం.. ఏడాదిలోనే 90శాతం హామీలు అమలు చేశాం.. 3.58కోట్లమంది లబ్దిపొందారు.. 2లక్షల 73వేల 756కోట్లు నేరుగా లబ్దిదారులకు ఇచ్చాం.. 4లక్షల 58వేల 360కోట్లు ఐదేళ్లలో ప్రజలకు అందించాం.. చంద్రబాబుది అంతా దగా.. మోసం.. ఏడాది అయినా లోకేష్ కు ఏమీ అర్దం కాలేదంటున్నారు.. ఆడబిడ్డ నిధి పథకం కింద ఏడాదికి 32వేల 480కోట్లు ఎగ్గొట్టారు.. దీపం పథకం కింద 4వేల 83కోట్లకు కేవలం 865కోట్లు ఇచ్చి దీపం పథకం ముగించారు.. కక్షసాధింపు తప్ప ఇచ్చిన మాట నిలబెట్టునే ఆలోచనే మీకు లేదని అన్నారు.
Also Read:Tollywood : ఫాదర్ సెంటిమెంట్‌తో వచ్చిన.. టాలీవుడ్ బెస్ట్ మూవీస్
ఉచిత బస్సుకు 3వేల 500కోట్లు ఏడాదికి ఎగ్గొట్టారు..మహిళలనుమోసం చేశారు.. 50ఏళ్ల వయసుగల ఎస్సీ,ఎస్టీ మహిళలు 20లక్షలు ఉన్నారు… వారికి పెన్షన్ ఎగ్గొట్టారు.. నిరుద్యోగ భృతి అంటూ రెండోసారి మోసం చేశారు.. 20లక్షలమందికి 7వేల 200కోట్లు నిరుద్యోగులకు ఎగ్గొట్టారు.. అన్నదాతలు 53లక్షల 58వేల256మంది ఉన్నారు.. 1716కోట్లు అన్నదాత సుఖీభవ ఎగ్గొట్టారు.. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చెయ్యకుండా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు.
Also Read:Shreyas Iyer : ఇంత బలుపు ఏంటి అయ్యర్.. రోహిత్ కు అవమానం
కొమ్మినేని శ్రీనివాసరావుపై కేసు పెట్టడమేంటని సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది.. ఒక రాజకీయ పార్టీనిమరో రాజకీయ పార్టీ ఎప్పుడూ భూస్థాపితం చెయ్యలేదు.. మళ్లీ మీరు రాష్ట్రం నుంచి పారిపోవాల్సిందే.. మీ తప్పుడు కేసులకు ఎవరూ భయపడరు.. నువ్వు.. మీ అబ్బాయి భూస్థాపితం కాకుండా చూసుకోండి.. జగన్ రెండు వేలు లాగేశాడన్నావు.. ఇప్పుడు నువ్వు చేసేదేంటి.. ఆరోజు నువ్వు అన్నదే ఇప్పుడు మేం అంటున్నాం.. మీరు చేసే ప్రతిదానికి మూల్యం చెల్లించాల్సిందే అని అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు.