తూర్పు గోదావరి జిల్లా రాజానగరం పోలీసులు అక్రమ గంజాయి నిల్వ ఉంచి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్న భార్యాభర్తలు, వీరికి సహకరిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి ఒక వ్యాన్, కారు, రెండు మోటారు సైకిల్లను, రేకుల షెడ్ సీజ్ చేసినట్లు తెలిపారు. గంజాయి కేసుకు సంబంధించిన వివరాలను రాజమండ్రి నార్త్ జోన్ డిఎస్పీ వై. శ్రీకాంత్ వెల్లడించారు. రాజానగరం మండలంలో కొండగుంటూరు కొండాలమ్మ గుడి సమీపంలో ప్రైవేట్ లే అవుట్ రేకుల షెడ్ లో వీరిని పోలీసులు పట్టుకున్నారని తెలిపారు.
Also Read:Leopard : సంగారెడ్డి జిల్లా కల్హేర్‌లో చిరుత కలకలం.. బీబీపేట్ గ్రామంలో భయాందోళనలు
ఒరిస్సా జిల్లా చిత్రకొండ రఘువీర్ రాయ్, ఇతని భార్య ప్రశాంతి రాయ్ గంజాయి అక్రమంగా నిల్వ ఉంచి రవాణా చేస్తున్న కేసులో అరెస్టు చేశారు పోలీసులు. కారులో భార్యాభర్తలు గంజాయి తీసుకుని వచ్చినట్లు తెలిసి పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారు. వీరికి సహకరించిన ఒరిస్సా రాష్ట్రం మల్కాగిరి జిల్లా చిత్రకొండ మండలం దొరగుడ పంచాయతీ సురేష్ చంద్ర కులదీప్, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం పొల్లూరు గ్రామానికి చెందిన చందన్ మండల్ ను అరెస్టు చేశారు.
Also Read:NEET Score Scam: ముంబైలో వెలుగు చూసిన నీట్ స్కోర్ బాగోతం.. రూ. 90 లక్షలు డిమాండ్!
కారులో నుంచి 11 ప్యాకెట్లు 23.101 కేజీల గంజాయి దించుతుండగా దాడులు చేసి పట్టుకున్నారు. గంజాయి, రవాణాకు ఉపయోగిస్తున్న ఒక వ్యాన్, కారు, రెండు బైకులను సీజ్ చేశారు. ఈ అక్రమ సంపాదనతో కొంతమూరులో విశాలమైన ఇల్లు కొనుగోలు చేసుకుని నివాసం ఉంటున్నారు నిందితులు. కొండ గుంటూరులో రేకుల షెడ్ సీజ్ చేశారు. కొంతమూరు ఇల్లు సీజ్ చేయడానికి ఉన్నతాధికారులకు నివేదికలు పంపించారు పోలీసులు.