Nara Lokesh: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. వైసీపీ ఆరోపణలు నిరూపించాలని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. వైసీపీకి 24 గంటల డెడ్ లైన్ పెట్టారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై జగన్ అండ్ కో కుట్రలు, కుతంత్రాలు – తల్లికి వందనం పథకంపైనా విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల మాటల విని జనం నవ్విపోతారన్న స్పృహ కూడా లేకుండా అభాండాలు మోపుతున్నారని చెప్పుకొచ్చారు. ఇక, తల్లికి వందనంలో మినహాయించే రూ. 2 వేలు లోకేష్ లాగేసుకున్నారట.. దిక్కుమాలిన ఆరోపణలతో వైసీపీ బరితెగింపు ట్వీట్ చేసిందని ఐటీ మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
Read Also: Kunamneni Sambasiva Rao: కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికి రాదు.. కూనంనేని కీలక వ్యాఖ్యలు
అయితే, వైసీపీ చేసిన ఆరోపణలు నిరూపించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. ఇలా పచ్చిగా రెచ్చిపోవడం అలవాటుగా మార్చుకుందని అన్నారు. ఒకటో తేదీనే ఇంటికి వెళ్లి మరీ పెన్షన్లు పంపిణీ చేస్తే కడుపు మండుతుందన్నారు. రేషన్ వాహనాలు రద్దు చేసి ప్రజాధనాన్ని కాపాడితే ఆందోళన చేస్తున్నారు. రాజధాని అమరావతికి పునర్ వైభవం తెచ్చే పనులు చేస్తే అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై బట్టకాల్చి మీదేసే తంతు చేస్తున్నారు. గతంలోనూ వివేకా హత్య కేసును చంద్రబాబుపై తోసేసే ప్రయత్నం చేశారు.. నారా సుర రక్తచరిత్ర అంటూ నానా యాగీ చేశారు.. పింక్ డైమండ్ చంద్రబాబు దగ్గరే ఉందంటూ రచ్చ రచ్చ చేశారు.. కోడికత్తి నుంచి.. గులకరాయి ఘటన వరకు టీడీపీపై నెట్టే ప్రయత్నం చేసింది వైసీపీ.. కానీ, ఈసారి వైసీపీ ఆరోపణలపై కఠినంగా వ్యవహారిస్తామని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు.