కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ది చాలా కీలక పాత్ర.. పాలసీ మేకింగ్, వాగ్దానాల అమలు విషయంలో పవన్ కల్యాణ్ అన్నిటినీ సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నారు. కూటమిలో జనసేనకు ఎక్కువ బాధ్యత ఉంది.. ప్రజలకోసం కూటమికి జనసేన ఎప్పుడూ సహకరిస్తుందని తెలిపారు జనసేన పీఏసీ చైర్మన్, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్..
విశాఖపట్నంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఈ రోజు విజయవాడ, విశాఖపట్నం సహా రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాల నుంచి దేశంలోని వివిధ నగరాలకు, అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ విషయంలోనూ శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం ఎయిర్పోర్ట్) టెర్మినల్ భవనాల నిర్మాణ పురోగతిపై ఏపీ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ లో కొత్త నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... AP PPC అనే కంపెనీ ఏర్పాటు చేసి, ఆక్వా రైతులకు, ఆక్వా కంపెనీలకు కావాల్సిన అన్ని సేవలు అందించనుంది.. అలాగే, ఫీడ్ ధరలో 14 రూపాయలు MRP మీద అందరికీ సమానంగా తగ్గించాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.. విద్యుత్ టారిఫ్ తగ్గించడం ద్వారా ఆక్వా రైతులకు భారం తగ్గించాలని నిర్ణయించారు.. స్ధానిక మార్కెట్‌ను పెంచడానికి, రొయ్యల వినియోగం పెంచడానికి ప్రభుత్వం పలు చర్యలు…
సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు తల్లులకు కానుకగా తల్లికి వందనం ఇవ్వనుంది ప్రభుత్వం.. రేపే తల్లికి వందనం నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.. సీఎం చంద్రబాబు.. తల్లికి వందనంపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం నిధులు రేపు వారి ఖాతాల్లో జమ చేయనుంది…
ఏపీ రెరాలో రిజిస్టర్ కాని ప్లాట్లు, అపార్ట్మెంట్లు కొనుగోలు చేయవద్దని సూచించారు ఆంధ్ర ప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (APRERA) ఛైర్పర్సన్ సురేష్ కుమార్..
విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు చెబుతూ.. అందరికీ గుడ్ న్యూస్ చెప్పారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళామణులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నాం అన్నారు.. సూపర్ సిక్స్‌లో ముఖ్యమైన హామీ అమలు చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు.. తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు..
భూమా అఖిలప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఆళ్లగడ్డలో నూతన సీసీ రోడ్డును ప్రారంభించారు ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ.. రూ. 25 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు భూమి పూజ చేశారు.. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్న కూటమి ప్రభత్వాన్ని చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.. ఇక, కళ్లు తిరిగి పడిపోయి నేను హాస్పిటల్ లో ఉంటే.. నన్ను చూడటానికి ఎవరు వచ్చారు..? ఎవరు రాలేదంటూ..? వార్తలు రాస్తున్నారు…
High Tension In Podili: ప్రకాశం జిల్లాలోని పొదిలి పర్యటనలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుగు మహిళల నిరసన సెగ తగిలింది. జగన్ గో బ్యాక్ అంటూ ప్లకార్డులు, నల్ల బ్యాడ్జీలతో టీడీపీ కార్యకర్తలు నిరసన చేశారు.