YS Sharmila: జగన్, కేసీఆర్ ఎంత క్లోజ్ అంటే..? షర్మిల షాకింగ్ కామెంట్స్..
- ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్..
- ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవమే..
- ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నాకు చెప్పారు..
- ట్యాపింగ్ జరిగిన నా ఆడియో ఒకటి నాకే వినిపించారు..
- జగన్, కేసీఆర్ మధ్య సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Sharmila: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. ఎవరి ఫోన్ వదలకుండా.. ప్రతిపక్షంలో ఉన్న కీలక నేతల ఫోన్లు అన్నీ ట్యాప్ చేశారంటూ.. రోజుకో పేరు బయటపెడుతున్నారు.. తెలంగాణకు చెందిన నేతల ఫోన్లనే కాదు.. ఏపీకి చెందిన నేతల ఫోన్లు ట్యాప్ చేసి కూడా.. గతంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఇచ్చారనే ఆరోపణలు వినపడుతున్నాయి.. ఈ తరుణంలో షాకింగ్ కామెంట్స్ చేశారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవమేనన్న ఆమె.. నా ఫోన్, నా భర్త ఫోన్, నా దగ్గరివాళ్ల ఫోన్లు ట్యాప్ చేశారని.. అసలు, ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నాకు చెప్పారని తెలిపారు.. ఆనాడు ట్యాపింగ్ జరిగిన నా ఆడియో ఒకటి నాకే వినిపించారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మని చెప్పినా వస్తానని వెల్లడించారు వైఎస్ షర్మిల..
Read Also: KCR: కేసీఆర్ సంచలన నిర్ణయం.. రైతుల పక్షాన మరో పోరాటం..!
Also Read
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
ఇక, జగన్, కేసీఆర్ మధ్య సంబంధాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు వైఎస్ షర్మిల.. జగన్, కేసీఆర్ మధ్య సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయిందన్నారు.. తెలంగాణలో నన్ను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకే ఇద్దరి స్కెచ్ వేసి ఫోన్ ట్యాపింగ్ చేశారని విమర్శించారు.. ఆనాడు కేసీఆర్, జగన్ మధ్య మంచి అవినాభావ సంబంధం ఉండేదని.. ఇద్దరు సీఎంలు కలిసి చేసిన జాయింట్ ఆపరేషనే ఫోన్ ట్యాపింగ్ అని ఆరోపించారు.. వైవీ సుబ్బారెడ్డి మా ఇంటికొచ్చి నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు చెప్పారన్నారు. ట్యాప్ చేసిన ఒక ఆడియో నాకు స్వయంగా వినిపించారని చెప్పుకొచ్చారు.. అయితే, ఈ విషయాన్ని ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకుంటారా? అంటే అనుమానమే అని వ్యాఖ్యానించారు వైఎస్ షర్మిల.. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు విచారణను వేగవంతం చేయాలని కోరారు..
తాజావార్తలు
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!