జగన్‌కు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. రప్పా.. రప్పా…!
పుష్ప-2 సినిమాలోని ‘రప్పా.. రప్పా..’ డైలాగ్ ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్‌ను తాకింది.. ‘అంతు చూస్తాం.. రప్పా రప్పా నరుకుతాం’ అంటూ పల్నాడులో ఓ యువకుడు ప్లకార్డు ప్రదర్శించడం దీనికి మూల కారణం కాగా.. ‘పుష్ప’ సినిమాలో డైలాగ్ కొట్టడం కూడా తప్పేనా? అంటూ మీడియా సమావేశంలో జగన్ వ్యాఖ్యానించడంపై సీఎం చంద్రబాబు, మంత్రులు, టీడీపీ నేతలు మండిపడుతున్నారు.. ఒక వైపు పాజిటివ్ తో యోగా జరుగుతుంటే మరికొందరు రప్పా రప్పా అంటున్నారు.. ఒకప్పుడు ఊళ్లలో గ్రామ దేవతలకు పొట్టేళ్లు బలి ఇచ్చి రప్పా రప్పా అనేవారు.. ఇప్పుడు.. ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.. ఒకప్పుడు నేరస్తుల తో దూరంగా ఉండేవారం.. ఇప్పుడు నేరస్తులతో కలిసి రాజాకీయాలు చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎవరైనా పోలీసులను తిడతారా..? అని ప్రశ్నించారు చంద్రబాబు.. ఏ పార్టీ అయినా ఇలాంటి ఒరవడి ఉందా? జగన్ కు 11 సీట్లు ఎందుకు ఇచ్చారు. వెధవ పనులు చేస్తే 11 ఇచ్చారు కదా? పోలీసులు చెప్పాక ఎవరైనా వెళ్తారా.? ఇరుకు సందుల్లో పోయి.. తొక్కిసలాట కు పాల్పడతారా..? ఒక పద్ధతి హుందాతనం నాయకుల కు ఉండాలని హితవు చెప్పారు.. ఇక, ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ లు ఉండవు.. ఇసుక, లిక్కర్ లో ఏమి జరిగిందో తెలియదా? అని ప్రశ్నించారు సీఎం.. హత్యలు, అత్యాచారం చేసే వాళ్లకి విగ్రహాలు పెడతారా..? లా అండ్ ఆర్డర్ పాటించే వాళ్లని నెగెటివ్ గా చూస్తూన్నారని దుయ్యబట్టారు.. అయితే, గంజాయి వాడితే మక్కేలు విరగ్గొడతా? అని వార్నింగ్ ఇచ్చారు.. గత ప్రభుత్వంలో అరాచకాలు జరిగాయా లేదా? మరి యాక్షన్ ఉండొద్దా..? అని నిలదీశారు.. ఎమ్మెల్యే లు ఇంటిటికి వెళ్ళినప్పుడు. ప్రజలు అడిగితే సమాధానం చెప్తా.. వైసీపీ అడిగితే మాత్రం తాట తీస్తాం అని హెచ్చరించారు.
రప్పా.. రప్పా నరుకుతారట.. ఎవర్ని ప్రజలనా..? ప్రజాస్వామ్యన్నా..?
రప్పా.. రప్పా నరుకుతాం.. అంటే.. సంతోషం అంటారు జగన్..! ఖండించాలి కదా..? రప్పా.. రప్పా.. ఎవర్ని నరుకుతారు.. ప్రజలనా..? ప్రజాస్వామ్యన్నా..? అని ప్రశ్నించారు ఏపీ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో చేసిన కామెంట్లపై స్పందించిన పయ్యావుల.. రాష్ట్రంలో రౌడీలు తన వెనక నడవమని జగన్ చెప్తున్నారు.. జగన్ ఎప్పుడూ భయపెట్టి రాజకీయం చెయ్యాలని అనుకుంటారు. అధికారంలో ఉన్నప్పుడు హౌస్ అరెస్ట్ లు చేశారు.. అధికారం పోయాక రౌడీలను ఏకం చేస్తున్నారని విమర్శించారు.. రాజును రాజ్యం నుంచి తరిమేస్తే చాణుక్యుడు బందిపోటులను ఏకం చెయ్యి అని సలహా ఇస్తాడు.. ఇప్పుడు అదే సలహాను జగన్ ఫాలో అవుతున్నారు.. గంజాయి, బ్లెడ్ బ్యాచ్‌ను ప్రోత్సాహిస్తున్నారు.. రాజారెడ్డి రాజ్యాంగం అని ఫ్లెక్సీలు కట్టి.. రప్పా.. రప్పా నరుకుతాం అంటున్నారని మండిపడ్డారు. అయితే, అరాచక పాలనను రప్పా రప్పా నరికి ఏడాది అయ్యిందన్నారు పయ్యావుల.. ఇది చంద్రబాబు ప్రభుత్వం.. ఫ్యాక్షన్ నేతలను చాలా మందిని చూసారు.. ఇలాంటి అరాచకాలు సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.. రప్పా.. రప్పా నరుకుతాం.. అంటే సంతోషం అంటారు వైఎస్ జగన్.. ఖండించాలి కదా.? అని ప్రశ్నించారు.. ఎవర్ని నరుకుతారు.. ప్రజలనా.. ప్రజాస్వామ్యన్నా.? అని మండిపడ్డారు.. ఓటమి తర్వాత మార్పు కనపడడం లేదు.., తెనాలి వెళ్లి రౌడీ షీటర్ లను పరామర్శించారు.. పొదిలిలో మహిళల పై అరాచకాలు చేశారు.. నిన్న నాగ మల్లేశ్వర రావు విగ్రహ ప్రతిష్ఠకు వచ్చారు.. ఇద్దరు చనిపోయారు.. కనీసం, జగన్ పరామర్శించారా? అని ఫైర్ అయ్యారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIను మంజూరు చేయండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
ఢిల్లీలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ఆయన నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సమావేశం అయ్యారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో 76.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో ఫేజ్-II అవసరం ఎంతో ఉందని కేంద్ర మంత్రికి దృష్టికి తీసుకెళ్లారు సీఎం. రూ.24,269 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడి ప్రాజెక్టుగా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. మెట్రో ఫేజ్-II సాకారమైతే నగరంలో రాకపోకలు వేగంగా కొనసాగడంతో పాటు రహదారులపై రద్దీ కూడా తగ్గుతుందని వెల్లడించారు. అలాగే, సుస్థిరాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని కేంద్ర మంత్రి ఖట్టర్ కు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక, పట్టణ వ్యవహారాల శాఖ సూచన మేరకు అవసరమైన సవరణలు చేసి ప్రాజెక్టు డీపీఆర్ సమర్పించిన విషయాన్ని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినట్లు గుర్తు చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-II ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని ఇతర శాఖల నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని కోరారు.
రేపు ఎల్బీ స్టేడియంలో యోగా దినోత్సవ వేడుకలు.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్రమంత్రి
అంతర్జాతీయ యోగా దినోత్సవం-2025ను పురస్కరించుకుని ఎల్బీ స్టేడియంలో ఉక్కు మరియు బొగ్గు, గనుల శాఖ ఆధ్వర్యంలో రేపు (జూన్ 20న) ఉదయం 5:30 గంటలకు ప్రారంభమయ్యే 24 గంటల కౌంట్‌డౌన్ వేడుకలకు భారీ ఏర్పాట్లు సాగుతున్న నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వహణ, భద్రత, సదుపాయాలు, వేదిక ఏర్పాట్లపై అవసరమైన సూచనలు చేశారు. ఇక, ఆయన మాట్లాడుతూ.. 21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా యోగ దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయని తెలిపారు. భారత ప్రభుత్వం తరపున, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున దేశంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం.. విశాఖపట్నం వేదికగా యోగా కార్యక్రమాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. అయితే, 24 గంటల కౌన్ డౌన్ పేరుతో రేపు ఉదయం యోగ పండుగ నిర్వహిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మాజీ ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, ప్రముఖులు, సినీ హీరోలు, సినీ తారలు, యోగ గురువులు పాల్గొంటారని చెప్పుకొచ్చారు.
బూతులు తెలుసుకున్నంత సులువు కాదు.. బేసిన్ల గురించి తెలుసుకోవడం!
తెలంగాణ భవన్ లో మీడియాతో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. బ్యాగుల మీద నాలెడ్జి ఉన్న రేవంత్ రెడ్డికి బేసిన్ ల మీద లేదు అని ఆరోపించారు. ఈయనకు బేసిక్స్ తెలియదు.. బేసిన్స్ తెలియదు.. మన రాష్ట్ర పరువు పోయింది అని ఎద్దేవా చేశారు. అంతులేని అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, బనకచర్ల ఏ బేసిన్ లో ఉందని సీఎం అడుగుతున్నాడు.. అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోండి అని అంటే ఆయనకు అర్థం కావట్లేదు.. అఖిలపక్షం మీటింగ్ ను రాజకీయాలకు వేదికగా మార్చారు అని మండిపడ్డారు. దేవాదుల ప్రాజెక్టుల ఎక్కడ కట్టారా కూడా తెలియదు.. బూతులు తెలుసుకున్నంత సులువు కాదు.. బేసిన్ ల గురించి తెలుసుకోవడం అనేది సీఎం తెలుసుకోవాలని సూచించారు. నల్లమల పులిబిడ్డ అని చెప్పే రేవంత్ రెడ్డికి.. అది ఆంధ్రనా, తెలంగాణ నా తెలియదు అని హరీశ్ రావు విమర్శించారు. ఇక, నా ప్రెస్ మీట్ తర్వాతనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత తేదీలతో లేఖలు విడుదల చేస్తున్నారు అని హరీశ్ రావు పేర్కొన్నారు. నిన్న సీఎం మాట్లాడిన మాటలు బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే ఉందన్నారు. గోదావరి నుంచి 1000 టీఎంసీలు తీసుకోండి అని ఎలా చెబుతావు అని ప్రశ్నించారు. అసలు ముఖ్యమంత్రి సోయి ఉండి మాట్లాడుతున్నాడా.. బేసిక్ నాలెడ్జి కూడా లేకుండా మాట్లాడుతున్నావు అని మండిపడ్డారు. 2.10.2020లో కేంద్ర మంత్రికి కేసీఆర్ లేఖ రాశారు.. సముద్రంలో కలిసే 3000 టీఎంసీల నీళ్లలో 1950 టీఎంసీల నీళ్లు కావాలని ఆ లేఖ రాశారు అని తేల్చి చెప్పారు.
రెండ్రోజుల్లో మూడు రాష్ట్రాల పర్యటన.. ఏపీకి సైతం మోడీ రాక..
మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన జరగనుంది. జూన్ 20–21 తేదీల్లో బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. బీహార్‌లోని సివాన్ జిల్లాలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు రూ. 400 కోట్ల విలువైన వైశాలీ–దియోరియా రైలు మార్గం ప్రారంభిస్తారు. పట్నా–గోరఖ్‌పూర్ మధ్య “వందే భారత్” ఎక్స్‌ప్రెస్ ను స్టార్ట్ చేస్తారు.మార్హౌరా ప్లాంట్ లో తయారైన తొలి “లోకోమోటివ్ రైలు ఇంజిన్” ను గినియా దేశానికి ఎగిమతి కార్యక్రమంలో ప్రధాన పాల్గొంటారు. “నమామి గంగే” కింద రూ. 1800 కోట్లతో 6 శుద్ధి కేంద్రాల ప్రారంభిస్తారు. రూ. 3000 కోట్లతో నీటి సరఫరా, మురుగు శుద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. బీహార్‌లో 500 MWh సామర్థ్యంతో “బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్” ప్రారంభిస్తారు. అలాగే.. బీహార్ లో 53,600 మంది “ప్రధానమంత్రి ఆవాస్ యోజన- పట్టణ ప్రాంత” లబ్ధిదారులకు మొదటి విడత నిధుల విడుదల చేస్తారు. 6,600 మంది లబ్ధిదారుల గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం.. మోడీ ఒడిశాకు వెళ్తారు. ఒడిస్సా ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా మధ్యాహ్నం 4.15 నిమిషాలకు రాష్ట్రస్థాయి బీజేపీ నేతల సమావేశానికి సభాధ్యక్షత వహిస్తారు. రూ .18,600 కోట్ల విలువైన ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. బౌద్ జిల్లా లో తొలిసారిగా రైలు మార్గంతో పాటు, కొత్త రైలు ప్రారంభిస్తారు. భువనేశ్వర్‌లో “రాజధాని ప్రాంత పట్టణ రవాణా పధకం”(CRUT) కింద 100 ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతారు. ప్రఖ్యాత ఒడియా వ్యక్తుల జన్మస్థలాల అభివృద్ధి ప్రోగ్రాం, 16.5 లక్షల ‘లక్షపతి దిద్దీలను’ సత్కరించే కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు.
‘‘బిన్ లాడెన్‌ను మర్చిపోయారా.?’’ ఆసిమ్ మునీర్‌తో లంచ్‌పై విమర్శలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో భేటీ అవ్వడం, ఆయనకు లంచ్ ఆతిథ్యం ఇవ్వడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉగ్రవాద దాడి వెనక అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడని, దాదాపు 3000 మందిని చంపిన అతను పాకిస్తాన్ లోని అబోటాబాద్ ఆర్మీ క్యాంప్ సమీపం దాక్కున్న విషయాన్ని థరూర్ గుర్తు చేశారు. పాకిస్తాన్ ప్రతినిధి బృందాన్ని కొంతమంది సెనెటర్లు, కాంగ్రెస్ సభ్యులు కలిశారు, కానీ అమెరికా ప్రజలు ఒసామా బిన్ లాడెన్‌ని అంత త్వరగా మరిచిపోలేరని అన్నారు. బిన్ లాడెన్ దొరికే వరకు పాకిస్తాన్ అతడిని దాచిపెట్టింది, దీనిని అమెరికన్లు సులభంగా క్షమించలేరని అన్నారు. నకిలీ పాకిస్తాన్ పాలనను నమ్మవద్దని, ఎందుకంటే అది అమెరికా చరిత్రలోనే దారుణమైన ఉగ్రదాడికి కారణమైన ఉగ్రవాదికి ఆశ్రయం కల్పించిందని అన్నారు. పాకిస్తాన్ భారత్‌పై ఉగ్రదాడులకు మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. పాకిస్తాన్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉగ్రవాదులు, వారికి ఆర్థిక సాయం, ఆయుధాలు, శిక్షణ, భారతదేశం పైకి ఉగ్రవాదుల్ని పంపించకుండా ట్రంప్, ఆసిమ్ మునీర్‌ని హెచ్చరించారని తాను ఆశిస్తున్నట్లు థరూర్ పేర్కొన్నారు. ట్రంప్-మునీర్ లంచ్‌పై థరూర్ మాట్లాడుతూ.. ఆహారం బాగుందని, ఈ ప్రక్రియలో ఆయన ఆలోచనకు కొంత ఆహారం లభిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.
“భయపడొద్దు..” ఇరాన్ ప్రజలకు సుప్రీం లీడర్ అయతుల్లా అలీ కీలక సందేశం..
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పరస్పరం బాంబుల మోత మోగిస్తున్నాయి. దీంతో పశ్చిమాసియా రణరంగంలా మారింది. ఇప్పటికే ఇరుదేశాల్లోని కీలక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్‌లోని సోరోకా హాస్పిటల్, స్టాక్ ఎక్స్ఛేంజ్ క్షిపణి దాడుల్లో ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కీలక ప్రకటన చేశారు. ఖమేనీ తన ఎక్స్ ఖాతాలో తన దేశస్థులను ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టారు. మీరు శత్రువుకు భయపడితే.. వాళ్లు మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టరు అని రాసుకొచ్చారు. “నా ప్రియమైన దేశం, దేశ ప్రజలకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు శత్రువులను చూసి భయపడుతున్నారనే అభిప్రాయం కలిగితే.. వారు మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టరు. మీరు ఇప్పటివరకు చూపించిన ధైర్యం, అదే దృఢ సంకల్పాన్ని కొనసాగించండి. ధైర్యం, బలంతో ఉండండి. మీ వైఖరిపై స్థిరంగా నిలబడండి” అని ఖమేనీ పోస్ట్‌లో రాశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు, ఇజ్రాయెల్ భీరక దాడులు కొనసాగుతున్నప్పటికీ ఇరాన్ లొంగిపోయే పరిస్థితి కనిపించడం లేదని ఖమేనీ ప్రకటన ద్వారా తెలుస్తోంది. ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేస్తూ.. ఇరాన్ ఎవరికీ భయపడదని నిరూపించడానికి ప్రయత్నిస్తోంది.
‘రష్మిక సెంటిమెంట్’ కుబేరకు కలిసొస్తుందా..?
నేషనల్ క్రష్ రష్మిక ఏ సినిమా చేసినా ఈ నడుమ భారీ హిట్ అవుతోంది. నేషనల్ వైడ్ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. పుష్ప-2, చావా, యానిమల్ సినిమాలు పాన్ ఇండియాను ఊపేశాయి. ఈ సినిమాల తర్వాత ఆమె ఇమేజ్ భారీగా పెరిగింది. పైగా లక్కీ సెంటిమెంట్ అనే ట్యాగ్ వచ్చేసింది. తాజాగా ఆమె నటిస్తున్న కుబేర సినిమా రేపు రిలీజ్ కాబోతోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాగార్జున, ధనుష్ నటిస్తున్నారు. మూవీపై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. ధనిక, పేద వర్గాల మధ్య తేడాలు, రూ.10వేల కోట్ల స్కామ్ చుట్టూ కథను తిప్పాడు శేఖర్. పైగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ పై అందరికీ మంచి నమ్మకం ఉంది. ఆయన సినిమాలు సోషల్ మెసేజ్ తో పాటు బలమైన ఎమోషన్ చుట్టూ తిరుగుతాయి. ఇప్పుడు కుబేర కూడా అలాంటి కథే అని ట్రైలర్ తో తెలుస్తోంది. పైగా ఇందులో ధనుష్ బిచ్చగాడిగా నటించడం మరింత ఆసక్తి రేపుతోంది. బలమైన కంటెంట్, కొత్త రకం స్క్రీన్ ప్లే వల్ల మూవీకి భారీ అడ్వాన్స్ టికెట్స్ బుక్ అవుతున్నాయి. మూవీకి ఫుల్ పాజిటివ్ వైబ్స్ వచ్చేశాయి. చాలా ఆసక్తి రేపుతున్న సినిమా కాబట్టి రష్మిక సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ఇది గనక భారీ హిట్ అయితే మాత్రం రష్మిక రేంజ్ ఎక్కడికో వెళ్లిపోవడం గ్యారెంటీ అంటున్నారు.