తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశ పెట్టేందుకు టీటీడీ సిద్ధం అయింది. ఇందులో భాగంగా మొదటి దశలో టీటీడీ అధికారుల కోసం 35 బ్యాటరీ కార్లను ప్రవేశ పెట్టింది. వీటిని ఈరోజు తిరుమలకు తీసుకొచ్చారు. బ్యాటరీ కారులోనే టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుమలకు వచ్చారు. ప్రస్తుతం అధికారుల కోసం 35 బ్యాటరీ కార్లు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. రెండు, మూడు దశల్లో 100 ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. పర్యావరణాన్ని…
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు మంచి.. క్రేజ్ ఉంది. ఏ ఛానల్ కు లేని ఆదరణ ఉంది. ప్రతి నిత్యం ప్రజల పక్షం అనే నినాదం ప్రజల గుండె చప్పుడై ఎన్టీవీ తెలుగు న్యూస్ ఛానల్… ముందుకు సాగుతోంది. 2007 సంవత్సరం లో ప్రారంభమైన ఎన్టీవీ ఛానల్.. నేటితో 14 వసంతాలు పూర్తి చేసుకుని… 15 వ ఏడాదిలోకి అడుగు పెడుతోంది. ఈ నేపథ్యం లో రాజకీయ ప్రముఖులు, సినీతారలు, ప్రేక్షకులు,…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 878 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,13,001కి చేరింది. ఇందులో 19,84,301 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా… 14,862 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఏపీలో 13 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 13,838కి చేరింది. గడిచిన…
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేవారు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి.. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో జరిగిన సభలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంగ్లీష్‌లో బోధనలపై చంద్రబాబు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.. ఆయన మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయన్న ఆయన.. చంద్రబాబు కొడుకు నారా లోకేష్ ఏ మీడియంలో చదివాడో చెప్పాలని డిమాండ్ చేశారు.. ఇప్పుడు లోకేష్ కుమారుడు ఏ మీడియంలో చదువుతున్నాడు అని ప్రశ్నించిన మిథున్‌రెడ్డి.. చంద్రబాబు పిల్లలు మాత్రం…
నిన్న ఏర్పడిన “అల్పపీడనం” ప్రస్తుతము దక్షిణ ఛత్తీస్ ఘడ్ & పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 km ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు వంగి ఉన్నది. “రుతుపవన ద్రోణి” బికనేర్, అజ్మీర్, శివపురి, దక్షిణ ఛత్తీస్ ఘడ్ & పరిసర ప్రాంతాలలో ఉన్న అల్పపీడనం, విశాఖపట్నంల మీదగా మరియు ఆగ్నేయ దిశగా పశ్చిమమధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నది.…
ఆగస్టు వెళ్లిపోతోంది. అందరి చూపు కరోనా థర్డ్ వేవ్ మీదే ఉంది. ఎందుకంటే, సెప్టెంబర్, లేదంటే అక్టోబర్‌లో …ఎప్పుడైన థర్డ్ వేవ్ తడాఖా చూపొచ్చని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. అయితే దీని ప్రభావం సెకండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మీడియా రిసెర్చ్ -ICMR తాజాగా ప్రకటించింది. కరోనా థర్డ్ వేవ్ దేశం అంతటా ఒకేలా ఉంటుందని ఎవరూ చెప్పలేరని మెడికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. రాష్ట్రాలు ఉన్నట్టుండి ఆంక్షలు ఎత్తివేసినా, నిబంధనలకు నీళ్లొదిలేసినా…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఏపీపై తెలంగాణ… తెలంగాణపై ఏపీ.. ఇలా ఫిర్యాదుల పర్వానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడంలేదు.. తాజాగా కృష్ణా నది యాజమాన్య బోర్డు మెంబర్ సెక్రటరీకి లేఖ రాశారు ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణరెడ్డి.. సాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ఇండెంట్ లేకుండా తెలంగాణ చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని నిలువరించాలంటూ కేఆర్ఎంబీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలం , నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్నందున కేఆర్ఎంబీ అనుమతితో…
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీసుకున్న తాజా నిర్ణయం వివాదాస్పదంగా మారింది.. ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని 177 కల్యాణ మండపాల నిర్వహణను హిందూ సంస్థలు, ఆలయాలు, మఠాలు, ట్రస్ట్‌లు, హిందూ మతానికి చెందిన వ్యక్తులకు 5 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చేందుకు సిద్ధమైంది.. 5 సంవత్సరాల కాలపరిమితితో లీజుకు ఇచ్చేందుకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది టీటీడీ.. అయితే, ఓ వైపు నూతన కల్యాణ మండపాలను నిర్మిస్తూ… మరో వైపు నిర్మించిన కల్యాణ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. ఏపీ రాజధానిగా విశాఖను పేర్కొంటూ కేంద్రం ఓ ప్రకటన చేసింది. జులై 26న లోక్‌సభలో ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్రం.. ఏపీ రాజధాని వైజాగ్ అని అర్థం వచ్చేలా ప్రకటన చేసింది. అయితే, దీనిపై మళ్లీ క్లారిటీ ఇచ్చింది కేంద్రం… వైజాగ్ ఏపీ రాజధాని అని చెప్పటం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేసింది.. విశాఖ ఒక నగరం మాత్రమేనని తాజాగా పేర్కొంది..…
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. తుర్లపాడు మండలం రోలుగుంపాడులోని ఎస్టీ కాలనీ వద్ద టాటా ఏస్ వాహనం బోల్తా పడిన ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మృతిచెందారు.. రోడ్డుపై చనిపోయిన గేదెపైకి దూసుకెళ్లిన టాటా ఏస్ వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది.. స్పాట్లోనే ఐదుగురు మృతిచెందగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయినట్టుగా చెబుతున్నారు.. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.. క్షతగాత్రులను చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి…