ఆంధ్రప్రదేశ్ వాతావరణ సూచన…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న ఏర్పడిన “అల్పపీడనం” ప్రస్తుతము దక్షిణ ఛత్తీస్ ఘడ్ & పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 km ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు వంగి ఉన్నది. “రుతుపవన ద్రోణి” బికనేర్, అజ్మీర్, శివపురి, దక్షిణ ఛత్తీస్ ఘడ్ & పరిసర ప్రాంతాలలో ఉన్న అల్పపీడనం, విశాఖపట్నంల మీదగా మరియు ఆగ్నేయ దిశగా పశ్చిమమధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నది. ఈరోజు తూర్పు-పడమర ‘షీర్ జోన్'(ద్రోణి) 15°N అక్షాంశము వెంబడి సగటు సముద్ర మట్టానికి 5.8 km నుండి 7.6 km ఎత్తుల మధ్య స్థిరంగా కొనసాగుతున్నది.
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :
Also Read
- OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
- Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
- AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
- CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేకచోట్ల కురిసే అవకాశం ఉంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ నుండి అతిభారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మరియు విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర :
ఈరోజు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాలలో భారీ నుండి అతిభారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది మరియు ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు కృష్ణా, గుంటూరు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ :
ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు కర్నూలు, కడప జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!