ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా అప్పుడప్పుడు పెరుగుతూనే ఉన్నాయి.. ఇక, ఇప్పటికే ఎన్నో కుటుంబాల్లో కరోనా మహమ్మారి కలకలం రేపింది.. తాజాగా, శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గౌతు శివాజీ కుటుంబం కరోనా బారినపడింది… మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ్‌సుందర్ శివాజీ , ఆయన సతీమణి , కుమార్తె టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పలాస నియోజకవర్గ సమన్వయకర్త గౌతు శిరీషకు కూడా కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. ప్రస్తుతం వైజాగ్ లోని…
విజయనగరంలో ఓ మహిళా ఎస్సై ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంగా మారింది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సఖినేటిపల్లి మహిళా అడిషనల్ ఎస్సై కె.భవానీ విజయనగరంలో ఆత్మహత్య చేసుకున్నారు.. ఆమె స్వస్థలం కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెంపాలెం గ్రామంగా చెబుతున్నారు అధికారులు… 2018 బ్యాచ్‌కి చెందిన ఎస్సై భవానీ అవివాహితురాలు.. అయితే, వారం రోజుల క్రితం విజయనగరం జిల్లాలో పీటీసీ ట్రైనింగ్ నిమిత్తం వెళ్లి వచ్చారామె… కానీ, ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి అనేది మాత్రం తెలియాల్సి…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాబోయే మూడు, నాలుగు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు… మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని వెల్లడించింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మెదక్, మహబుబ్‌నగర్ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, ఏపీ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జోరుగా…
గుంటూరు జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. తల్లీకూతుళ్లను సొంత చిన్నాన్న కొడుకే కిరాతకంగా పొడిచి హత్య చేశాడు. సత్తెనపల్లిలోని నాగార్జుననగర్‌లో ఇంట్లో ఉన్న తల్లి, కూతుళ్లు వెంకట సుగుణ పద్మావతి, కూతురు లక్ష్మీ ప్రత్యూషను నిందితుడు శ్రీనివాసరావు అతి దారుణంగా హత్య చేశాడు. . దుండగుడు ఇద్దరు మహిళల్ని అత్యంత కిరాతకంగా చంపుతోన్న దృశ్యాలను వీడియో తీశారు చుట్టపక్కల వాళ్లు. కత్తితో పొడుస్తున్న దుర్మార్గుడితో తల్లీకూతుళ్లు పెనుగులాడుతున్న దృశ్యాలు కలకలం రేపాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించినా…
కరోనా ప్రభావం పబ్లిక్ ట్రాన్స్‌ఫోర్ట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది.. లాక్డౌన్ దెబ్బకు ఆర్టీసీ బస్సులు, అద్దె బస్సులు అన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి… ఇక, ఆ తర్వాత క్రమంగా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కినా.. అద్దె బస్సుల చక్రాలు మాత్రం కదలలేదు.. అయితే, అద్దె బస్సుల వినియోగానికి ఏపీఎస్ఆర్టీసీ అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. దీంతో, సెప్టెంబరు 1 నుంచి అద్దె బస్సులను నడిపేందుకు సిద్ధం కావాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించింది సర్కార్.. మరోవైపు.. ప్రత్యేకంగా మార్గదర్శకాలు కూడా…
మొన్నటి వరకూ ఆయన సైకిల్ పార్టీకి ఏపీ అధ్యక్షుడు. అలాంటి నాయకుడికి ఇప్పుడు సొంత ఇలాకాలోనే ఓ నేత కంట్లో నలుసులా మారారు. పార్టీలో నుంచి బహిష్కరించినా .. టీడీపీ జెండా వదలడం లేదట. కీలక నేతకు కునుకు లేకుండా చేస్తున్నారట. ఇప్పుడిదే హాట్ టాపిక్. కళాకు కంట్లో నలుసులా మారిన కలిశెట్టి! శ్రీకాకుళం జిల్లాకు ముఖద్వారమైన ఎచ్చెర్లలో రాజకీయం ఎప్పుడూ రసవత్తరమే. పార్టీలు అధికారంలో ఉన్నా లేకపోయినా లోకల్ పాలిటిక్స్ ఆసక్తిగా ఉంటాయి. ఒకప్పుడు ఇక్కడ…
తెలుగుభాష ప్రాధాన్యత బీజేపీ పార్టీ పెద్ద పిఠ వేసింది అని ఏపీ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. కానీ వైసీపీ పార్టీ మాత్రం తెలుసు బాష ప్రాధాన్యత ఇవ్వడనికి వ్యతిరేకం అని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యకలపాలు అన్ని తెలుగుబాష ప్రాధన్యత ఇవ్వాలి. రాష్ట్రం లో గోవద చట్టం సక్రమంగా అమలు చెయ్యాలేని వైసీపీపార్టీ ఒక మంత్రి గోవును చంపుకుని తింటే తప్పు ఏమిటి అనడం దారుణం. బీజేపీ పార్టీ అధికారంలో గోవద చట్టం…
విశాఖలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ భారీ జీఎస్టీ మోసంకి పాల్పడింది. శ్రీపాద్ ఇన్ఫ్రా ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ 69కోట్ల రూపాయలు టాక్స్ ఎగ్గొట్టినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఎండీ శ్రీనివాస రెడ్డి ఇంట్లో కంపెనీకి చెందిన అకౌంట్స్, ఇతర డాక్యుమెంట్లు సీజ్ చేసింది ఆదాయపన్ను శాఖ. 2006నుంచి ఇప్పటి వరకు వందల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు నడిపిన శ్రీపాద్ ఇన్ఫ్రా… ఇప్పటి వరకు నాలుగు సార్లు కంపెనీ పేర్లు మార్చి వ్యాపారం చేసాడు.…
ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్ కేసుల భారీగా పెరిగిపోయాయి.. ప్రస్తుతం హైకోర్టు, సుప్రీంకోర్టులో కలిపి వివిధ కోర్టుల్లో 1.94 లక్షల మేర పెండింగ్ కేసులు ఉన్నట్టు గుర్తించింది ప్రభుత్వం.. ఇక, దీనికి తోడు ప్రస్తుతం రోజూ సగటున 450 కొత్త దావాలు దాఖలవుతున్నాయని చెబుతున్నారు.. దీంతో.. అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న పెండింగ్ కేసులు సత్వర పరిష్కారం కోసం చర్యలు ప్రారంభించింది ఏపీ సర్కార్.. దీనికోసం ఆన్లైన్ లీగల్ కేస్ మానీటరింగ్ సిస్టమ్ అనే కొత్త వ్యవస్థ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది..…
ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం.. భారీ మార్పులకు పూనుకున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.. దానికి తగ్గట్టుగానే అధిష్టానం.. రాష్ట్రానికి చెందిన నేతలతో విడివిడిగా సమావేశం కూడా అయ్యింది.. ఈ నేపథ్యంలో కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక త్వరలోనే జరగనున్నట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం పీసీసీ చీఫ్‌గా ఉన్న శైలజానాథ్ ను మార్చాలని అధిష్ఠానం నిర్ణయానికి రాగా.. కొత్త అధ్యక్షుడి వేటలో పడింది.. దీని కోసం పరిశీలనలో చింతామోహన్, జేడీ శీలం, హర్షకుమార్ పేర్లు…