ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 878 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,13,001కి చేరింది. ఇందులో 19,84,301 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా… 14,862 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఏపీలో 13 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 13,838కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 1182 మంది కరోనా నుంచి కోలుకున్నారు. చిత్తూరులో 255, తూర్పుగోదావరిలో 166 కేసులు నమోదయ్యాయి.
Read: బైడెన్‌కు తలనొప్పిగా మారిన ఆఫ్ఘన్…ఉత్తర కొరియాలు…