విశాఖ రాజధాని అని చెప్పలేదు..! క్లారిటీ ఇచ్చిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. ఏపీ రాజధానిగా విశాఖను పేర్కొంటూ కేంద్రం ఓ ప్రకటన చేసింది. జులై 26న లోక్‌సభలో ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్రం.. ఏపీ రాజధాని వైజాగ్ అని అర్థం వచ్చేలా ప్రకటన చేసింది. అయితే, దీనిపై మళ్లీ క్లారిటీ ఇచ్చింది కేంద్రం… వైజాగ్ ఏపీ రాజధాని అని చెప్పటం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేసింది.. విశాఖ ఒక నగరం మాత్రమేనని తాజాగా పేర్కొంది.. పెట్రోలియం ట్యాక్స్‌కు సంబంధించి మాత్రమే విశాఖ పేరును ఉదహరించామని క్లారిటీ ఇచ్చింది.. ఇక, హెడ్డింగ్ పొరపాటు వల్లే ఈ సమస్య తలెత్తిందన్న కేంద్ర ప్రభుత్వం.. హెడ్డింగ్‌లో క్యాపిటల్‌తో పాటు సమాచారం సేకరించిన సిటీ పేరును కూడా చేర్చుతున్నామని వెల్లడించింది. దీనిపై లోక్‌సభ సచివాలయానికి కూడా సమాచారం ఇచ్చామని, ప్రధాన నగరాలలో పెట్రోల్ ధరల ప్రభావాన్ని అంచనా వేశామని తెలిపింది. కాగా, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. వైజాగ్ పరిపాలన రాజధానిగా నిర్ణయించింది.. ఇక, త్వరలోనే వైజాగ్ నుంచి పాలన ప్రారంభిస్తామని కూడా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చెబుతూ వస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!