మాజీ మంత్రి కుమారుడు ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి తప్పలేదు. ఓడాక.. పార్టీని, కేడర్‌ను ఆయన పట్టించుకోవడం లేదట. పైగా అధికారపక్షానికి దగ్గరవుతున్నారని గుర్రుగా ఉన్నారట తెలుగు తమ్ముళ్లు. ఇంకేముందీ.. ఆయన్ని పక్కన పెట్టేయాలని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట. ఆ రగడేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఓటమి తర్వాత హరికృష్ణ కనిపించలేదని కేడర్ ఆరోపణ! చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు. ఈ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. నాయకత్వ లేమి కారణంగా ఇక్కడ పార్టీకి ఓటమి…
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న సునీల్ యాదవ్ ను నార్కో పరీక్షలకు అనుమతి కోసం జమ్మలమడుగు కోర్టులో ప్రవేశపెట్టారు. నార్కో పరీక్షలు జరపాలంటే న్యాయస్థానం అనుమతించడంతో పాటు, నార్కో పరీక్షలు చేయించుకునే వ్యక్తి అంగీకారం కూడా అవసరం. ఈ నేపథ్యంలో, న్యాయమూర్తి స్పందిస్తూ, నార్కో పరీక్షలకు సమ్మతమేనా? అని సునీల్ యాదవ్ ను అడిగారు. నార్కో పరీక్షలకు తాను అంగీకరించబోనని సునీల్ యాదవ్…
కృష్ణా బోర్డు సమావేశాన్ని తెలంగాణ అధికారులు వాకౌట్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి పై ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య భిన్నాభి ప్రాయాలు వచ్చినట్లు సమాచారాం అందుతోంది. కెఆర్ఎంబి సమావేశంలో జలాల పంపిణీ పై ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల అధికారుల మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో తెలంగాణ అధికారులు వాకౌట్ చేశారు. 50; 50 అంటూ తెలంగాణ పట్టు పట్టగా… 70; 30 కావాలని ఏపీ ప్రభుత్వం తమ వాదనను వినిపించింది. సాగు, తాగునీటి అవసరం ఉన్నపుడు…
ఇటీవల ఆంధ్రప్రదేశ్ సమాచార, రవాణ శాఖా మంత్రి పేర్ని నాని మెగా స్టార్ చిరంజీవికి ఫోన్ చేసి… సినిమా రంగానికి సంబంధించిన సమస్యలను డైరెక్ట్ గా ముఖ్యమంత్రి జగన్ కు నివేదించాల్సిందిగా కోరారు. దాంతో చిరంజీవి తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖ నిర్మాతలు సురేశ్ బాబు, ‘దిల్’ రాజు, అక్కినేని నాగార్జున, బీవీఎస్ఎన్ ప్రసాద్, సుప్రియ, దామోదర ప్రసాద్, నారాయణ దాస్ నారంగ్ తదితరులతో కలిసి సమావేశమయ్యారు. చిత్రసీమకు చెందిన ఏ యే సమస్యలను జగన్…
ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 1186 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20, 15, 302 కి చేరింది. ఇందులో 19 ,86 , 962 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా… 14, 473 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఏపీలో 10 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు రుతుపవన ద్రోణి పోరుబందర్, సూరత్, జల్గావ్, రామగుండం, మచిలీపట్నంల మీదుగా మరియు ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నది.ఒక ఉపరితల ద్రోణి దక్షిణ గుజరాత్ నుండి దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టం నుండి 3.1 km నుండి 5.8 km ఎత్తుల మధ్య ఏర్పడింది. వీటి ప్రభావం వలన…
చినికి చినికి గాలివానగా మారడం అంటే ఏంటో నరసరావుపేట గొడవను చూస్తే తెలుస్తుంది. మున్సిపల్ కమిషనర్ తీరుకు ఓ వర్గం యుద్ధం ప్రకటించింది. సమస్యను ఎలా కొలిక్కి తేవాలో ఎమ్మెల్యేకు పాలుపోవడం లేదు. వివాదం ఎక్కడ రాజకీయంగా తనకు ప్రతికూలంగా మారుతుందోనని ఆందోళన చెందుతున్నారట. ముస్లిం మహిళా వాలంటీర్‌పై కమిషనర్ ఆగ్రహం! గుంటూరు జిల్లా నరసరావుపేట. పల్నాడుకు ముఖద్వారమైన ఈ ప్రాంతంలో మాటంటే పడేరకం కాదు ఇక్కడి ప్రజలు. అలాంటిది ఒక ముస్లిం మహిళా వాలంటీర్‌పై మున్సిపల్…
తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం కొలిక్కి వస్తుందా? ఇగోలను పక్కనపెట్టి క్షేత్రస్థాయి అంశాలపై చర్చిస్తారా? తెలంగాణ ప్రస్తావించే అంశాలేంటి? ఏపీ వాదనలేంటి? ఇన్నాళ్లూ సమావేశాలకు దూరంగా ఉన్న తెలంగాణ.. KRMB, GRMB భేటీలకు హాజరు కావడం వెనక ఆంతర్యం ఏంటి? కేఆర్ఎంబీ భేటీపై ఉత్కంఠ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య జల యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. నీటి పంచాయితీలు తెగడం లేదు. ఇటీవల కృష్ణా నది యాజమాన్య బోర్డుకు, గోదావరి నది యాజమాన్య బోర్డుకు…
తెలుగు రాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు క్రమంగా పెరుగుతుంది. దాంతో శ్రీశైలంలో మళ్ళీ జలవిద్యుత్ ప్రారంభించారు. అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 50,317 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో 34,836 గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 873.90 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 158.6276 టీఎంసీలు ఉంది. అయితే ఎడమగట్టు జలవిద్యుత్…
ఒక నియోజకవర్గం.. మూడు వర్గాలు. ఒకరితో కుదరదని మరొకర్ని పెట్టినా పార్టీ గాడిలో పడటం లేదు సరికదా.. గ్రూపులు మరింతగా గట్టిపడుతున్నాయి. అందరినీ కలుపుకొని పోయే నేత లేక ఆ నియోజకవర్గ కేడర్ దిక్కులేనివారు అయ్యారట. ఉండి వైసీపీలో ఇంఛార్జ్‌ల మార్పు కామన్! పశ్చిమగోదారి జిల్లా ఉండి నియోజకవర్గం.. టీడీపీకి మరో కుప్పం. అలాంటి ఉండిలో పార్టీ జెండా ఎగరేయడానికి వైసీపీ చేయని ప్రయత్నం లేదు. ఇప్పటి వరకు అనేకమంది వైసీపీ ఇంఛార్జులు మారుతూ వచ్చారు. పార్టీ…