తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షల కారణంగా శ్రీశైలం జలాశయానికి మళ్ళీ వరద నీరు పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 23,323 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 28,091 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 874.50 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 161.2918 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతంకుడి,ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రలలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి…
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ లో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ధార్మిక విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు భగవత్ గీత పంపిణీ కార్యక్రమం బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ… కొన్ని షోషల్ మీడియా లో ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్నం అంటూ వస్తున్నా వ్యతిరేకిస్తున్న.. ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధానిగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి రాజ్యమేలుతుంది. వైసీపీ పార్టీ అవినీతి పైన బిజిపి పార్టీ యాత్ర చేపట్టి..…
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ, టీడీపీ మధ్య సవాళ్ల యుద్ధం నడుస్తుంది. అయితే ఎమ్మెల్యే అమర్నాథ్ ఛాలెంజ్ కు కౌంటర్ ఇచ్చారు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్. ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు తెలుగు దేశం పార్టీకి మాత్రమే ఉంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి పై చర్చించడానికి, సవాల్ చేయడానికి టీడీపీ సిద్దం అన్నారు. విశాఖపట్నం పునర్నిర్మాణం జరిగింది అంటే అది చంద్రబాబు చొరవతోనే. కానీ తెలుగు దేశం పార్టీ వద్ద రాజకీయాలలో ఓనమాలు నేర్చుకున్న అమర్నాథ్…
దివంగత నందమూరి హరికృష్ణ మూడవ వర్థంతి సందర్భంగా ఏపీలోని ఆయా జిల్లాల టీడీపీ కార్యాలయాల్లో ఘనంగా నివాళులర్పించారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో హరికృష్ణ చిత్రపటానికి మూలమాల వేసిన టీడీపీ నేతలు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. పార్టీకి, సమాజానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలోను హరికృష్ణ వర్థంతి కార్యక్రమం జరగింది. ఈ వర్థంతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబుతో పాటు కొమ్మారెడ్డి పట్టాభిరామ్, మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. హరికృష్ణ…
ఆ ఎస్పీ కొత్తగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన జిల్లాకు అడుగుపెట్టకముందే, ఆయన పనితీరు తెలిసి తలలు పట్టుకున్నారు. సరిగ్గా నెలకూడా గడవలేదు…ఆయనేంటో అధికారపార్టీ నేతలకు పూర్తిగా అర్థమై పోయింది. ద్వితీయ శ్రేణి నాయకుల సంగతి అటుంచితే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లకే ఆ ఎస్పీ కొరుకుడు పడడం లేదట…ఇంతకీ ఎవరా ఎస్పీ? ఆ జిల్లాలో ఏం జరుగుతోంది? కర్నూలు జిల్లా పోలీస్ బాస్ గా కర్ణాటక క్యాడర్ అధికారి సుధీర్ కుమార్ రెడ్డి నియమితులయ్యారని…
ఏపీలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడంలేదు. తాజాగా ఏపీలో 24 గంటల్లో 1557 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,12,123కి చేరింది. ఇందులో 19,83,119 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 15,179 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 18 మంది మృతిచెందినట్టు ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,825కి…
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. తిరిగి అన్ని రంగాలు ప్రారంభం అవుతున్నాయి. ఇక కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి వేలాదిమంది కొండకు వస్తుంటారు. కరోనా సమయంలో తాత్కాలిక ఆటంకం ఏర్పడింది. అయితే, ఇప్పుడు భక్తులకు అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ప్రత్యేక దర్శనం మాత్రమే అందుబాటులో ఉన్నది. ఇక ఇదిలా ఉంటే, ఉదయం నుంచి రాత్రి వరకు తిరుపతి నుంచి తిరుమలకు వందలాది ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేస్తుంటాయి. డీజిల్ బస్సుల కారణంగా కొండల్లో కాలుష్యం పెరిగిపోతున్నది. దీంతో…
గత ప్రభుత్వం ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తే.. సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.. ఎప్పుడైనా విశాఖ కేంద్రం పరిపాలన ప్రారంభం కావొచ్చు అని ఏపీ మంత్రులు, ఎంపీలు ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు.. అయితే, వైజాగ్ రాజధాని దిశగా కేంద్రం నుంచి ఆసక్తికరమైన సంకేతం వచ్చింది.. పార్లమెంట్ విడుదల చేసిన డాక్యుమెంట్లో ఏపీ రాజధాని వైజాగ్‌గా గుర్తించింది…
తమిళనాడులో మాతృత్వానికి మచ్చ తెచ్చిన ఓ ఘటన కలకలం రేపుతోంది.. కన్న బిడ్డను రకరకాలుగా కొట్టి చిత్రహింసలకు గురిచేసింది ఓ తల్లి.. దీంతో రెండేళ్ల ప్రదీప్ అనే బాలుడి పరిస్థితి విషమంగా మారింది.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు బాధితుడు.. విల్లిపురం జిల్లాలోని సత్యమంగళం మెట్టూరు గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెట్టూరు గ్రామానికి చెందిన వడివేలన్.. ఏపీలోని చిత్తూరు జిల్లా రాంపల్లికి చెందిన తులసిని పెళ్లి చేసుకున్నాడు.. వీరికి…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖరాశారు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు.. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో పునర్ సమీక్ష చేయాలని లేఖలో కోరారు.. వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతులు లేవని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భావిస్తోందని లేఖలో ప్రశ్నించిన టీడీపీ ఎమ్మెల్యేలు.. కేంద్ర ప్రభుత్వానికి, కృష్ణా నది యాజమాన్య బోర్డుకు.. తెలంగాణ సర్కార్ రాసిన లేఖలు వెనక్కి తీసుకోవాలని కోరారు.. అయితే, గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్టు పేరు లేకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్యేలు.. 2014…