సిమ్లా పర్యటన ముగించుకుని తాడేపల్లి చేరుకున్నారు సీఎం వైఎస్ జగన్. ఇక రేపు, ఎల్లుండి వైఎస్ఆర్ కడప జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కడప బయలుదేరనున్న ముఖ్యమంత్రి.. సాయంత్రం 4.50 గంటలకు ఇడుపులపాయ చేరుకుని పార్టీ నాయకులతో మాట్లాడి, వైఎస్ఆర్ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బస చేయనున్నారు. ఇక సెప్టెంబర్ 02వ తేదీన ఉదయం 9.30 గంటలకు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి…
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ఉన్న నిధులు, కేటాయింపులు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉన్న “అన్ రాక్” కంపెనీ ఆర్బిట్రేషన్ కేసుపై చర్చించాను. ఆ సంస్థకు అవసరమైన బాక్సైట్ ను సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. న్యాయపరంగా కేసు పరిష్కారమైతే, ఒక…
ఏపీలో మరోసారి కరోనా కేసులు పెరిగాయి. తాజాగా రాష్ట్రంలో 52,319 శాంపిల్స్‌ను టెస్ట్ చేయగా 1115 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,14,116కి చేరింది. ఇందులో 19,85,566 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 14,693 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 19 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 13,857 మంది మృతి చెందారు. గడిచిన…
ఢిల్లీ : కేంద్ర ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. ఏపీ లో ఫైబర్ నెట్ సంస్థ అక్రమంగా, అనధికారికంగా ఎం.ఎస్ ఓ .లైసెన్సెస్ ఉపయోగిస్తుందని… ఏపీ ఫైబర్ నెట్ చర్యలు బ్రాడ్ కాస్టింగ్ బిల్లు 1997 కు చట్ట విరుద్ధమని లేఖ లో పేర్కొన్నారు ఎంపీ రఘురామ. బ్రాడ్‌కాస్టింగ్ బిల్లు 1997 ప్రకారం ప్రభుత్వ సంస్థలు, ఎం.ఎస్.ఓ లైసెన్సెస్ పొందలేవని.. అనధికారికంగా, అక్రమంగా వాడుతున్న…
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారం హాట్ టాపిక్‌గా నడుస్తూనే ఉంది.. ఏ క్షణంలోనైనా విశాఖకు రాజధాని తరలిపోవచ్చు అని చెబుతూ వస్తున్నారు మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు.. అయితే, ఇవాళ రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి.. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో చిత్తూరు జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామితో కలిసి పాల్గొన్న ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని…
ఏపీ శ్రీకాకుళం జిల్లా పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. ఈ నెల 16 నుండి రాష్ట్ర వ్యాప్తంగా విద్య సంస్థలు ప్రారంభైన విషయం తెలిసిందే. కానీ గడచిన పది రోజుల్లో ముగ్గురు టీచర్లు, నలుగురు విద్యార్ధులకు పాజిటివ్ వచ్చింది. తాజాగా ఆమదాలవలస మున్సిపాల్టీ పరిధి లక్ష్మీనగర్ లోని మున్సిపల్ హైస్కూల్ లో నలుగురు 10వ తరగతి విద్యార్ధులకు కరోనా వచ్చింది. వారం రోజుల క్రితం అదే హైస్కూల్లో ఓ టీచర్ కు కోవిడ్ నిర్ధారణ అయ్యింది. అయితే…
వెలిగొండ ప్రాజెక్టు విషయంలో.. ఇటు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ నేతలు.. మరోవైపు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.. ఇప్పుడు హస్తినకు కూడా వెళ్లారు.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ని కలిసింది ప్రకాశం, నెల్లూరు జిల్లాల తెలుగుదేశం పార్టీ శాసనసభ్యలు, మాజీ శాసనసభ్యలు, నాయకుల బృందం.. వెలిగొండ ప్రాజెక్టు అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. వెలిగొండ ప్రాజెక్టును తక్షణమే అనుమతి పొందిన ప్రాజెక్టుగా కేంద్ర గెజిట్‌లో చేర్పించాలని కేంద్ర మంత్రిని కోరిన…
టీడీపీ నేత కూన రవికుమార్‌పై ఏపీ ప్రివిలేజ్ కమిటీ సీరియస్ అయ్యింది.. ప్రివిలేజ్ కమిటీ ముందు కూన రవి హాజరుకాకపోవడాన్ని ధిక్కారంగా భావిస్తున్నామని చైర్మన్ కాకాని గోవర్ధన్‌రెడ్డి అన్నారు.. ఇవాళ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిని ఆదేశించింది ప్రివిలేజ్ కమిటీ.. కానీ, వారు హాజరు కాలేదు.. ఇక, ప్రివిలేజ్ కమిటీ తదుపరి సమావేశం వచ్చే నెల 14వ తేదీన జరపాలని నిర్ణయించారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రివిలేజ్ కమిటీ చైర్మన్…
ఆ ఒక్క మాట వారికి బాగా కలిసి వచ్చింది. అధికారం పోదన్న ధీమా వాళ్లను నేలమీద నిలబడ నివ్వడం లేదు. అధికారం చేజారిపోదన్న నమ్మకం అందుకు కారణమా? ఎవరా నాయకులు? ఏంటా రాజకీయం? లెట్స్ వాచ్! తాడిపత్రిలో గేర్ మార్చిన జేసీ! మున్సిపల్ ఎన్నికల తర్వాత అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయం మారింది. అసలే గరం గరంగా ఉండే ఇక్కడి పాలిటిక్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య ఉప్పు…