ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికలకు సంబందించిన పూర్తి ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలు అధికార వైసీపీకి అనుకూలంగా ఉండటం విశేషం. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ దూసుకుపోయింది. భారీ విజయాలు నమోదు చేసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా 7,219 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా అధికార వైసీపీ 5998 చోట్ల విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ 826 చోట్ల, జనసేన 177 చోట్ల, బీజేపీ 28, సీపీఎం15, సీపీఐ 8, ఇతరులు 157 స్థానాల్లో విజయం సాధించారు. ఇండిపెండెంట్లు ఎక్కువ స్థానాలు…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. కరోనా కేసులు తగ్గినట్టుగా తగ్గి తిరిగి పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో 1337 కరోనా కేసులు నమోదైనట్టు ఏపీ ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,38,690కి చేరింది. ఇందులో 20,09,921 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 14,699 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి…
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పరిషత్ ఎన్నికలల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. రాత్రి నాటికి పూర్తి జిల్లా పరిషత్ ఫలితాలు వెలువడుతాయని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీపీ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నిక ఈ నెల 24న జరుగుతుందని తెలిపారు. జిల్లా పరిషత్‌లో కో ఆఫ్షన్ మెంబర్స్, చైర్మన్ , వైఎస్ చైర్మన్ ఎన్నిక 25న జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని గిరిజా శంకర్ వెల్లడించారు. మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ఎంపీటీసీ…
హైలెట్ అవ్వాలంటే హడావిడి చేయాలన్నదే ఆ ఎమ్మెల్యే ఫిలాసఫీనా? అధినేత దృష్టిలో పడి పదవి పొందాలనుకుంటున్నారా? అందరి కంటే ముందుండాలని అనుకున్నారా? తాజా రచ్చ వెనక కారణం అదేనా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? జోగి రమేష్ దూకుడు వెనక కారణం వేరే ఉందా? మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్స్ ఏపీలో రాజకీయ దుమారం రేపాయి. సీఎంను పట్టుకుని అంత మాట అంటావా అని ఏకంగా చంద్రబాబు ఇంటి దగ్గర రభస చేశారు…
అమరావతి : ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ ధాఖలు అయింది. ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ లో నిందితుడు సాంబశివరావు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఈ హౌస్ మోషన్ పిటిషన్ స్వీకరించింది ఏపీ హైకోర్టు. ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న IRTC అధికారి సాంబశివరావు… గత ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ యండి గా విధులు నిర్వహించారు. కేంద్ర సర్వీసులో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే కేంద్రప్రభుత్వం అనుమతి తీసుకోవాలని పిటిషన్ లో…
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబందించిన ఫలితాలు వెటువడుతున్నాయి. ఎంపీటీసీ ఫలితాల్లో దూసుకుపోతున్న వైసీపీ ఇప్పుడు జెడ్పీటీసి ఫలితాల్లో కూడా మెరుగైన స్థానాలు సొంతం చేసుకున్నది. మొత్తం 642 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, అందులో 152 స్థానలకు సంబందించిన ఫలితాలు వెలువడ్డాయి. ఈ 152 స్థానాల్లో అధికార వైసీపీ సొంతం చేసుకున్నది. ఇక ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు 3,985 ఎంపీటీసీ స్థానాలకు సంబందించిన ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో వైసీపీ 3585 స్థానాల్లో విజయం సాధించగా,…
ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నిజంగా కన్నెర్ర చేస్తే మీరు రోడ్డు మీద తిరగగలుగుతారా ? అచ్చెన్నాయుడుకు దమ్ము, ధైర్యం ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ప్రజల్లోకి వెళదాం… మీ సీట్లు మీకు మిగులుతాయో లేదో చూసుకుందామని పేర్కొన్నారు. ఓటమి తప్పదని ముందే టీడీపీ పారిపోయిందని… ఎన్నికలు బహిష్కరిస్తామని డ్రామాలు చేసిందని విమర్శించారు.రెండేళ్ల జగన్ ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి చూసి…
ఓట్ల లెక్కింపుపై పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది స్పందించారు. లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని… 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాల్లో కౌంటింగ్ జరుగుతోందని వెల్లడించారు. పలు కారణాల తో 6 చోట్ల బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నాయని… రెండుచోట్ల బ్యాలెట్ పేపర్లకు చెదలు, మిగిలిన4 చోట్ల తడిచాయని తెలిపారు. తాడికొండ మం. రావెల, బేజాతపురంలో బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నాయని… శ్రీకాకుళం జిల్లాలో షలాంత్రిలో బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నాయన్నారు జి.కె.ద్వివేది. విశాఖలో తూటిపల్ల, పాపయ్యపాలెంలో బ్యాలెట్లు తడిచాయని……
నవ్యాంధ్ర ఏర్పడి దాదాపు ఏడేళ్లన్నరేళ్లు కావస్తోంది. విభజన హామీలో భాగంగా విశాఖకు రైల్వే జోన్ తోపాటు మైట్రో ట్రైన్ ప్రాజెక్టు రావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ఏపీకి మెట్రో ట్రైన్ ప్రాజెక్టు మంజూరు కాకపోవడం శోచనీయంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ కు మాత్రమే మెట్రో రైలు ప్రాజెక్టును అప్పటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. టీఆర్ఎస్ సర్కారు హయాంలో మెట్రో ట్రైన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో హైదరాబాద్‌లో కొంతమేర ట్రాఫిక్ కష్టాలు తీరిపోయాయి. ఈ…