శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన తేదీలను ప్రకటించింది టీటీడీ.. అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.. 7వ తేదీన ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా.. 15న చక్రస్నానం, ధ్వజాఅవరోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.. ఇక, కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో.. ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించనున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇక, 7వ తేదీన రాత్రి పెద్దశేష…
అక్టోబర్ 11న ఆంధ్ర సీఎం జగన్ తిరుమలకు వెళ్లనున్నారు. అయితే తిరుమలలో అక్టోబర్ 7వ తేది నుంచి 15వ తేది వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. అందు భాగంగా 11 రాత్రి జరగనున్న గరుడ సేవ రోజున స్వామివారికి పట్టు వస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్పించనున్నారు సీఎం జగన్. అదే రోజు అలిపిరి వద్ద 13 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గో మందిరం….తిరుమలలో 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అదనపు బూందీ…
దేవాదాయశాఖలో ఆయనో సీనియర్ ఆఫీసర్. పదేళ్లకుపైగా సర్వీస్. రేపో మాపో పదోన్నతి దక్కుతుందన్న తరుణంలో.. చేస్తున్న కొలువుకు ఆయన ఓ దణ్ణం పెట్టేశారు. అదీ అవమాన భారం భరించలేక. ఇంతకీ ఎవరా అధికారి…!!?. ఆయన కలతకు కారణం ఏంటి…!?. ఇసుక దాడి వివాదంలో మరో ట్విస్ట్! గుర్తుందా విశాఖ దేవాదాయశాఖ కార్యాలయంలో కూర్చున్న ఓ అధికారిపై ఓ మహిళా ఉద్యోగి ఇసుక వేయడం. అదీ సీసీ కెమెరాలో రికార్డ్ కావడం.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడం.. ఆ వ్యవహారం…
అధికారపార్టీలో ఆయనో సీనియర్ ఎమ్మెల్యే. అధినాయకుడి ఫ్యామిలీకి వీరవిధేయుడు. అలాంటి శాసనసభ్యుడికి హైకమాండ్ ఓ ఆఫర్ ఇచ్చింది. పిలిచి పదవిస్తే ససేమిరా అన్నారు. ఆఫర్ తిరస్కరించి కొత్త చర్చకు తెరతీశారు. ఇంతకూ ఎవరా ఎమ్మెల్యే? అధిష్ఠానం ఇచ్చిన అవకాశం ఏంటి? తనకు టీటీడీ పదవా అని పెదవి విరిచారట!ఎమ్మెల్యే అసంతృప్తితో పార్టీ పునరాలోచన? తిరుమల శ్రీవారి సేవాభాగ్యం కోసం రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు పోటీపడుతుంటారు. ట్రస్ట్ బోర్డ్ సభ్యుడిగా ఒక్కసారైనా పనిచేయాలని కలలు కంటారు. సుదీర్ఘ…
ఆయనో కేంద్ర మాజీ మంత్రి. 30 ఏళ్ల రాజకీయ అనుభవం. అలాంటి పెద్దాయన ‘మనసు…గాయపడింది. తాడేపేడో తేల్చేయాలని నిర్ణయించుకున్నారట. రూట్ మార్చి లేఖల యుద్ధం ప్రారంభించారు. ఇంతకీ ఆయన ‘పోరాటం’ ఫలిస్తుందా!? ఇప్పుడు రోజూ వార్తల్లో వ్యక్తి అయ్యారు! అశోక్ గజపతిరాజు. టీడీపీ సీనియర్ నేత. పార్టీలో కూడా ఆయన్ను రాజుగానే ట్రీట్ చేసేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన ప్రముఖంగా కనిపించేవారు. అది కూడా అధికారిక కార్యక్రమాల్లో మాత్రమే. కేంద్రం, రాష్ట్రంలో ఎక్కడైనా సరే…
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.. ప్రస్తుతం ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స తీసుకుంటున్నారు పుష్ప శ్రీవారి… విజయవాడ నుండి విజయనగరం వెళ్తుండగా.. ఆమె స్వల్ప అస్వస్థతకు గురైనట్టు అనుచరులు చెబుతున్నారు.. అయితే, పుష్ప శ్రీవాణి అస్వస్థతకు గురైన కారణాలతో పాటు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.. కాగా, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్.. ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణికి డిప్యూటీ సీఎం…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. అయితే రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 60,350 శాంపిల్స్ పరీక్షించగా… 1,393 మందికి పాజిటివ్‌గా తేలింది… మరో 08 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 1,296 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, తాజా కేసులతో కలుపుకొని.. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,36,179 కు చేరగా.. 20,07,330…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు హీట్ పెంచాయి… ప్రభుత్వ విధానాలను ఎండగడుతూనే.. సీఎం వైఎస్ జగన్.. మంత్రులు, డీజీపీ.. ఇలా.. అందరినీ వరుసపెట్టి కామెంట్ల్ చేశారు.. ఆయన వ్యాఖ్యలపై భగ్గుమన్న వైసీపీ శ్రేణులు.. ఇవాళ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి ముట్టడికి కూడా వెళ్లారు.. అయితే, తన కామెంట్లపై మరోసారి స్పందించిన అయ్యన్నపాత్రుడు.. నేను మాట్లాడింది చూడండి.. ఎక్కడైనా తప్పు మాట్లాడానా? అని ప్రశ్నిస్తూనే..…
రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియామకం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సిజే అరూప్ కుమార్ గోస్వామి.. ఛత్తీస్ గఢ్ కు బదిలీ కాగా… ఛత్తీస్ గఢ్ ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆంధ్రప్రదేశ్ సిజే గా బదిలీ అయ్యారు. ఇక తెలంగాణ హైకోర్టు కు ప్రధాన న్యాయమూర్తి నియామకం అయ్యారు. కర్ణాటక హైకోర్టు యాక్టింగ్ సిజేగా ఉన్న సతీష్ చంద్ర శర్మ ను తెలంగాణ సిజేగా బదిలీ అయ్యారు. కొలీజియం సిఫారసు మేరకు తెలుగు…
ఆంధ్రప్రదేశ్‌కు మరో 30 సంవత్సరాలపాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.. ఎవ్వరు ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఎంపీ రఘురామకృష్ణంరాజు చేత బెయిల్ రద్దు పిటిషన్ వేయించింది చంద్రబాబేనని ఆరోపించారు.. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని చంద్రబాబు.. ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని.. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏం చేయలేరన్నారు.. స్థానిక సంస్థల…