అమరావతి : ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ ధాఖలు అయింది. ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ లో నిందితుడు సాంబశివరావు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఈ హౌస్ మోషన్ పిటిషన్ స్వీకరించింది ఏపీ హైకోర్టు. ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న IRTC అధికారి సాంబశివరావు… గత ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ యండి గా విధులు నిర్వహించారు. కేంద్ర సర్వీసులో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే కేంద్రప్రభుత్వం అనుమతి తీసుకోవాలని పిటిషన్ లో పేర్కొన్నారు పిటిషనర్ తరుపు న్యాయవాది. కేసు క్వాష్ చేయాలని హైకోర్టును కోరారు పిటిషనర్ తరుపు న్యాయవాది. ఇక రేపు ఈ కేసు హైకోర్టులో విచారణకు రానుంది.