ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబందించిన ఫలితాలు వెటువడుతున్నాయి. ఎంపీటీసీ ఫలితాల్లో దూసుకుపోతున్న వైసీపీ ఇప్పుడు జెడ్పీటీసి ఫలితాల్లో కూడా మెరుగైన స్థానాలు సొంతం చేసుకున్నది. మొత్తం 642 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, అందులో 152 స్థానలకు సంబందించిన ఫలితాలు వెలువడ్డాయి. ఈ 152 స్థానాల్లో అధికార వైసీపీ సొంతం చేసుకున్నది. ఇక ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు 3,985 ఎంపీటీసీ స్థానాలకు సంబందించిన ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో వైసీపీ 3585 స్థానాల్లో విజయం సాధించగా, టీడీపీ 278 చోట్ల విజయం సాధించింది. ఇక జనసేన 24 చోట్ల, బీజేపీ 13 చోట్ల విజయం సాధించింది. ఇతరులు 85 చోట్ల విజయం సాధించారు. ఈరోజు రాత్రి వరకు ఎన్నికలకు సంబందించిన పూర్తి ఫలితాలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read: ఫ్రాన్స్, అమెరికా మధ్య ఆధిపత్య పోరు… అస్ట్రేలియా నుంచి వెనక్కి…