టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి రాజ్భవన్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు.వైసీపీనేతలు దాడికి పాల్పడుతున్న దృశ్యాల సీసీ టీవీ ఫుటేజీని కూడా వినతిపత్రంతో పాటు గవర్నర్ కార్యదర్శికి సమర్పించామన్నారు. టీడీపీ కార్యకర్తలు తన కారు అద్దాలు పగులగొట్టారన్నారు జోగి రమేష్.చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. అదే సమయంలో టీడీపీ నేతలకు వార్నింగిచ్చారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రేపు జరగనుంది. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అన్ని జిల్లాల్లో కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా సాగేందుకు వీలుగా ఐఏఎస్ అధికారుల్ని పరిశీలకులుగా నియమించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 206 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన పరిషత్ ఎన్నికల పోలింగ్…
అమరావతి : అయ్యన్నపాత్రుడు సమాజానికి పట్టిన చీడ అని.. అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని.. హోమ్ మంత్రి మేకతోటి సూచరిత ఫైర్ అయ్యారు. దళిత హోం మంత్రిగా సీఎం జగన్ నాకు అవకాశం కల్పించడం టీడీపీ నేతలకు రుచించడం లేదని… అయ్యన్నపాత్రుడు తనపై చేసిన వ్యాఖ్యలకు బాధ పడుతున్నాని తెలిపారు. దళిత మహిళకు ఉన్నత పదవి ఇవ్వడం అయ్యన్నపాత్రుడుకు నచ్చడం లేదా ? అయ్యన్న పాత్రుడు సంస్కార హీనంగా మాట్లాడారని నిప్పులు చెరిగారు.…
త్వరలోనే యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేస్తామని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. విశాఖలో హాయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు రెండవ సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో 30 మంది విద్యా సంస్థల డైరెక్టర్లు, వీసీలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా ప్లానింగ్ బోర్డు లేదు… మన రాష్ట్రంలోనే ఉందని గుర్తుచేశారు.. విద్యాశాఖ కిందకు రాని వెటర్నరీ, అగ్రికల్చర్, మెడికల్ యూనివర్సిటీలను ఒకే గొడుగు కిందకు తెచ్చామని.. మౌలిక వసతులు,…
కంచుకోట లాంటి జిల్లాలో ప్రస్తుతం వర్గపోరుకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది టీడీపీ. పార్టీ వేదికలపైనే వైరిపక్షాల్లా మాటలు దూసుకుంటున్నారు నేతలు. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని వార్నింగ్లు ఇస్తున్నారు. ఇంతకీ ఏంటా జిల్లా? ఎందుకు తమ్ముళ్లు కట్టు తప్పుతున్నారు? లెట్స్ వాచ్! జేసీకి వ్యతిరేకంగా ఒక్కటైన పాత టీడీపీ లీడర్లు! అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. మొన్నటికి మొన్న రాయలసీమ టీడీపీ నేతలంతా ఉన్న వేదికపైనే తాడిపత్రి…
గుంటూరు జిల్లా సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు రూట్ మార్చారా? తన కుమారుడికి సత్తెనపల్లి సీటు ఇస్తే చాలు.. తాను పోటీ నుంచి వైదొలుగుతానన్న రాయపాటి ఈసారి తన ఫ్యామిలీకి ఏకంగా రెండుసీట్లు ఇవ్వాల్సిందే అంటున్నారా? దాని వెనక ఆంతర్యం ఏంటి? అసలుదాన్ని పట్టాలంటే కొసరు అడగాల్సిందేనన్నదే రాయపాటి ప్లానా? కుమారుడికి సీటు కోసం రాయపాటి లాబీయింగ్! గుంటూరు రాజకీయాలను ఒంటిచేత్తో శాసించిన రాయపాటి సాంబశివరావు వారసుడిని రంగంలోకి దింపడానికి రెడీ అవుతున్నారట. గత ఎన్నికల్లోనే కుమారుడు…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలజగడం కొనసాగుతూనే ఉంది.. కేఆర్ఎంబీకి, కేంద్రానికి, జలశక్తిశాఖకు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు ఇలా.. రెండు రాష్ట్రాలు లేఖలు రాస్తూనే ఉన్నాయి.. తాజాగా కృష్ణా నది యాజమాన్య బోర్డుకు మరో లేఖ రాసింది ఏపీ. ఇవాళ, కేఆర్ఎంబీకి లేఖ రాశారు ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి… కృష్ణా నదిపై జలాశయాలన్నీ పొంగి పొర్లుతున్నాయి.. గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలివేయాల్సి వస్తోందన్న ఆయన.. వరద నియంత్రణలో భాగంగా ఈ నీటిని ఎగువన శ్రీశైలం జలాశయం…
మరోసారి టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు, టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్.. నిన్న చంద్రబాబు నివాసం దగ్గర హల్చల్ చేసి అరెస్ట్ అయిన ఆయన.. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. సభ్య సమాజం తలదించుకునేలా అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.. సీఎం వైఎస్ జగన్ను, మంత్రులను అసభ్యంగా తిట్టడం వెనుక చంద్రబాబు స్క్రిప్ట్ ఉందని ఆరోపించిన ఆయన.. చంద్రబాబు ఇంటికి నిరసన తెలపటానికి వెళ్తే నాపై దాడి చేశారని మండిపడ్డారు.. కాల్ మనీ సెక్స్…
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కాస్త తగ్గింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 25,829 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 35,821 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 873.40 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 156.3860 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం…
ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా వేడిక్కించాయి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు.. సీఎం వైఎస్ జగన్, వైసీపీ సర్కార్, కొందరు మంత్రులను, డీజీపీని టార్గెట్ చేస్తూ అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై అధికారపార్టీ మండిపడుతోంది.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసాన్ని ముట్టడించేందుకు కూడా ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు యత్నించాయి.. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఇక, అయ్యన్న వ్యాఖ్యలపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఘాటుగా కౌంటర్ ఇచ్చారు..…