ఏపీలో ఎంపీటీసీ, జెడ్‌పీటీ ఎన్నికలకు సంబందించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఉదయం 8 గంటల నుంచి ఎంపీటీసీ స్థానాలకు సంబందించిన కౌంటింగ్ జరుగుతున్నది. మొత్తం 9589 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమైన కౌంటింగ్‌లో వైసీపీ దూకుడు పెడుతున్నది. ఫలితాలు అధికార వైసీపీకి అనుకూలంగా వస్తున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 2714 స్థానాలకు సంబందించిన ఫలితాలను వెలువరించగా ఇందులో వైసీపీ 2506 చోట్ల విజయం సాధించింది. టీడీపీ 133 చోట్ల, జనసేన 7 చోట్ల బీజేపీ 6 చోట్ల విజయం సాధించింది. ఇతరులు 62 స్థానాలు కౌవసం చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే, మొత్తం 642 జెడీపీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఇప్పటి వరకు 132 స్థానాలకు సంబందించిన ఫలితాలు వెలువడ్డాయి. ఈ 132 స్థానాలను వైసీపీ కైవసం చేసుకున్నది.
Read: ఆసక్తిగా పంజాబ్ రాజకీయం: ఈ మధ్యాహ్నం వరకు…!!