ఓట్ల లెక్కింపుపై పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది స్పందించారు. లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని… 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాల్లో కౌంటింగ్ జరుగుతోందని వెల్లడించారు. పలు కారణాల తో 6 చోట్ల బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నాయని… రెండుచోట్ల బ్యాలెట్ పేపర్లకు చెదలు, మిగిలిన4 చోట్ల తడిచాయని తెలిపారు. తాడికొండ మం. రావెల, బేజాతపురంలో బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నాయని… శ్రీకాకుళం జిల్లాలో షలాంత్రిలో బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నాయన్నారు జి.కె.ద్వివేది. విశాఖలో తూటిపల్ల, పాపయ్యపాలెంలో బ్యాలెట్లు తడిచాయని… బ్యాలెట్ పేపర్ల వాలిడేషన్‌పై కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులదే నిర్ణయం అన్నారు. రీపోల్ అవసరమనుకుంటే ఎస్ఈసీ తుది నిర్ణయమని… ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు త్వరలోనే వస్తాయని వెల్లడించారు. జడ్పీటీసీ ఫలితాలు సాయంత్రం, రాత్రి వరకు వస్తాయని పేర్కొన్నారు.