ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్యకేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో నిందితులకు నార్కో ఎనాలసిస్ పరీక్షలు నిర్వహించాలంటూ సీబీఐ వేసిన పిటిషన్‌ను విజయవాడ కోర్టు కొట్టివేసింది.. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులకు నార్కో ఎనాలసిస్ టెస్ట్‌లు నిర్వహించాలని.. అందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు చేసింది సీబీఐ.. అయితే, నిందితుల తరపున న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ వాదనలు వినిపించాడు.. ఇరు పక్షాల వాదనలు విన్న విజయవాడ కోర్టు..…
2019 ఎన్నికల్లో ప్రారంభమైన వైసీపీ వేవ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల వెల్లడైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలను చూస్తుంటే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. అయితే టీడీపీ పరిస్థితి మాత్రం 2019 కంటే ఇంకా దయనీయంగా మారినట్లు కన్పిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచిన చోట సైతం ఇప్పుడు ఆపార్టీ సత్తా చాటలేకపోవడం ఇందుకు నిదర్శంగా నిలుస్తుంది. టీడీపీకి కంచుకోటలుగా ఏరియాలు సైతం ఈ ఎన్నికల్లో బీటలువారినట్లు కన్పిస్తుండటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించి ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. విపక్షాలు సైతం గట్టిగా నిలదీయలేని సమస్యలపై ఆయన పోరాటం చేస్తూ ప్రజల్లోకి దూసుకెళుతున్న సంగతి తెల్సిందే. ఇక ఆపార్టీకి చెందిన ముఖ్య నేతల్లో నాదెండ్ల మనోహర్ ఒకరు. జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన పవన్ కల్యాణ్ వెంట నడుస్తున్నారు. పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. అయితే గత సార్వత్రిక…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. టీటీడీ పాలక మండలిలో 52 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జీవోను జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టులో వేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది. ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. టీటీడీలో జంబో బోర్డును నియమించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో…
తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి.ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి తోడు దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు పడతాయని తెలిపింది. పలుచోట్ల ఉరుములతో కూడిన వానలు పడే అవకాశముందని చెప్పింది. ఇక బెంగాల్ పరిసరాల్లో ఏర్పడిన ఆవర్తనం కారణంగా ఉత్తర, దక్షిణ కోస్తాలో తేలికపాటి వర్షాలు పడే అవకాశముంది. రాయలసీమలో పలుచోట్ల జల్లులు కురుస్తాయని అధికారులు…
విజయవాడ : త్వరలో జరగనున్న కాటన్ ప్రొక్యూర్మెంట్ విధి విధానాలపై ఉన్నతాధికారులు , సీసీఐ ( కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ) ప్రతినిధులతో మంత్రి కన్నబాబు సమావేశం నిర్వహించారు. నవంబర్ మొదటి వారం నుంచి ప్రత్తి కొనుగోలు ప్రక్రియ మొదలెట్టేందుకు చర్యలు తీసుకుకోవాలని సీఎం ఆదేశించారని ఈ సందర్బంగా పేర్కొన్నారు మంత్రి కన్నబాబు. సీఎం ఆప్ ద్వారా రాష్ట్రంలోని 50 ఎఎంసిలు , 73 జిన్నింగ్ మిల్స్ సీసీఐ ద్వారా కాటన్ ప్రొక్యూర్మెంట్ చేయనున్నామని.. దేశంలో…
ఆ నియోజకవర్గం ఇసుకకు పెట్టింది పేరు. ఇప్పుడు అదే ఇసుక వివాదం ఆ ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారింది. ఆయనే చేస్తున్నారో.. లేక ఆయనకు తెలియకుండా అనుచరులే చేస్తున్నారో కానీ.. అవన్నీ ఎమ్మెల్యే మెడకు చుట్టుకుంటున్నాయి. దీంతో ఎమ్మెల్యేకు అధిష్ఠానం నుంచి వార్నింగ్‌ల మీద వార్నింగ్‌లు వస్తున్నాయి. కార్యకర్తలకు సర్ది చెప్పుకోలేక.. హైకమాండ్ ఆగ్రహం తట్టుకోలేక ఎమ్మెల్యే సతమతం అవుతున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? లెట్స్ వాచ్! నాడు ఎమ్మెల్యే శంకర్రావు అనుచరుడు కంచేటి సాయిపై కేసు! గుంటూరు…
మా లక్ష్యం ఒక్కటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదు అన్నారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌రావు… స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 64 ఏళ్ల వయస్సులో విజయసాయి రెడ్డి పాదయాత్ర చేశారు. 70 ఏళ్ల వయస్సులో గాజువాక ఎమ్మెల్యే కూడా నిర్వాసితుల కోసం పాదయాత్ర చేశారు.. సీఎం వైఎస్ జగన్ ఇప్పటికి 3 సార్లు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాశారని గుర్తుచేశారు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశామన్న ఆయన.. అయితే, ఢిల్లీలో…
అవకాశం దొరికినప్పుడల్లా తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, ఇతర నేతలపై ఒంటికాలితో లేచే మంత్రి కొడాలి నాని.. మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు, లోకేష్‌ను ఉద్దేశిస్తూ.. తుప్పు, పప్పు అంటూ ఫైర్ అయ్యారు.. పరిషత్ ఎన్నికలను బహిష్కరించామని చంద్రబాబు అంటున్నారు.. మరి.. టీడీపీ నుంచి గెలిచినవాళ్లంతా.. పార్టీ ఆదేశాలను ధిక్కరించినవాళ్లా? అని ప్రశ్నించారు.. సీఎం జగన్‌ను ప్రజలు దీవిస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్న కొడాలి నాని.. పరిషత్ ఎన్నికల్లో…
గ్రామాల్లో 100 శాతం ఇంటి పన్నుల వసూళ్లపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గ్రామాల్లో ఇళ్ల పన్నుల వసూళ్లకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను కూడా తీసుకొచ్చింది. టెక్నాలజీ సాయంతో 100 శాతం ఇంటి పన్నులను వసూళ్లు చేయొచ్చని అధికారులు చెబుతున్నారు.. బోగస్ చలానాలు.. నకిలీ రసీదుల బెడద ఉండదని స్పష్టం చేస్తున్నారు అధికారులు.. పక్కాగా ఇంటి పన్నుల వసూళ్లైతే గ్రామ పంచాయతీలకు నిధులు సమకూరుతాయని అంచనా వేస్తోంది వైసీపీ సర్కార్.. ఇక, ఇంటి పన్నుల వసూళ్లకోసం…