సీఎం జగన్ ఏపీలో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణంగా ఆయన రాష్ట్రమంతా చేసిన పాదయాత్రనే. జనంలో ఉన్నాడు కాబట్టే గెలిచాడంటారు. అందుకే 2019 ఎన్నికల్లో ఫ్యాన్ గాలి జోరుగా వీయడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. దాదాపు రెండున్నరేళ్లుగా వైసీపీ సర్కారు పాలన కొనసాగుతోంది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. నాడు ఇచ్చిన హామీలతోపాటు ఎన్నికలను మేనిపెస్టోనూ తూ.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. దీంతో ఆయన పాలనపై ప్రజల్లో నమ్మకం…
రేషన్ బియ్యం పేదలకు పరమాన్నమైతే.. అవినీతి అధికారులకు కాసులు కురిపించే ముడిసరుకు. కాసేపు కళ్లు మూసుకుంటే చాలు.. చాలా మంది జేబులు నిండిపోతాయి. ఇది ప్రతి జిల్లాలో ఉండే బాగోతమే..! ఆ జిల్లాలో మాత్రం అక్రమాలను కొత్త పుంతలు తొక్కిస్తున్నారట. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టుగా ఉందట అవినీతి అధికారుల తీరు. పీడీఎస్ బియ్యాన్ని పట్టుకోకుండా డబ్బులతో మేనేజ్..? పేదలకు రేషన్ దుకాణాల ద్వారా అందించే PDS బియ్యాన్ని అక్రమ మార్గాల్లో మాఫియా తరలిస్తుందన్నది ఓపెన్ టాక్.…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఊరట లభించింది… ఈనెల 2వ తేదీన ఐదుగురు ఐఏఎస్‌లకు శిక్ష విధిస్తూ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పు ఇచ్చారు.. అయితే.. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఆదేవాలను నిలిపివేసింది డివిజన్ బెంచ్.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్, ఐఏఎస్ అధికారి ముత్యాల రాజు, శేషగిరి బాబు, కెవీఎన్ చంద్రధర్ బాబు వేసిన అప్పీల్‌ను స్వీకరించిన హైకోర్టు.. భూ పరిహారం పూర్తిగా అప్పటికే చెల్లించడంతో పాటు తమవంతుగా…
వైసీపీ అధికారంలోకి వచ్చి పట్టుమని రెండున్నరేళ్లు కూడా పూర్తి కాలేదు. అప్పుడే టీడీపీ నేతలు అసెంబ్లీని రద్దును చేసి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్లాలంటూ సవాల్ విసురుతున్నారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. క్లియర్ కట్ గా వైసీపీనే మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు బల్లగుద్ది చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ నేతలు మాత్రం మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తుండటం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. 2019 ఎన్నికల్లో మొదలైన…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కృష్ణా జలాల విషయంలో ఫిర్యాదుల పర్వానికి తెరపడే పరిస్థితి కనిపించడంలేదు.. ఒకరుపై ఒకరు పోటీపడీ మరీ కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదులు చేసుకుంటున్నారు.. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో తెలంగాణ చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిపై మరోసారి కేఆర్ఎంబీకి లేఖరాసారు తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ శ్యామలరావు.. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి వల్ల విలువైన నీరు వృథా అవుతోందని కేఆర్ఎంబీకి రాసిన లేఖలో పేర్కొన్న ఆయన.. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ వాడుకున్న 113…
కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాల అమలు విషయంలో వెనుకడుగు వేయడం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పుడు డ్వాక్ర మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పింది వైసీపీ సర్కార్.. అక్టోబర్ 7వ తేదీ నుంచి వరుసగా 10 రోజుల పాటు విజయ దశమి కానుకగా రెండో విడత ఆసరా అందజేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.. స్పందన కార్యక్రమం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. అక్టోబర్ 7 నుంచి 10 రోజుల పాటు…
ఇక, క్షేత్రస్థాయిలో పర్యటనలకు సిద్ధం అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో దీనిపై సంకేతాలు ఇచ్చారు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు చాలా ముఖ్యమన్న ఆయన.. అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చే నెల నుంచి ఎమ్మెల్యేలు సచివాలయాలను సందర్శించాలని ఆదేశించిన సీఎం జగన్.. డిసెంబర్ నుంచి నేను కూడా సచివాలయాలను సందర్శిస్తానని తెలిపారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో గృహనిర్మాణం, ఉపాధిహామీ పనులు, వైయస్సార్ అర్బన్ క్లినిక్స్, గ్రామ, వార్డు…
పరిషత్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.. అయితే, మేం ఎన్నికలను బహిష్కరించడం వల్లే ఈ ఫలితాలు అంటోంది తెలుగుదేశం పార్టీ.. కానీ, వైసీపీ మాత్రం టీడీపీ, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడుతోంది.. కుప్పంలో చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారు.. సొంత నియోజకవర్గంలో ప్రజలు ఆయనకు రాజకీయ సమాధి కట్టారని వ్యాఖ్యానించారు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప.. పరిషత్ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటికైనా చంద్రబాబు తన తప్పులు తెలుసుకోవాలని సూచించారు.. కోర్టుల ద్వారా వైఎస్…
ఆంధ్రప్రదేశ్ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ క్రమంగా పెరుగుతూ పోతోంది.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 56,720 శాంపిల్స్ పరీక్షించగా.. 1,365 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఎనిమిది మంది కోవిడ్ బాధితులు కన్నుమూశారు.. ఇక, ఇదే సమయంలో 1,466 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ఏపీ సర్కార్.. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 2,78,70,218గా…