ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. టీటీడీ పాలక మండలిలో 52 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జీవోను జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టులో వేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది. ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. టీటీడీలో జంబో బోర్డును నియమించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో బీజేపీ నేత భాను ప్రకాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
Read: ఎవర్ గ్రాండే ఎఫెక్ట్ : కుప్పకూలిన చైనా రియల్ ఎస్టేట్… గంటల వ్యవధిలోనే…