ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్యకేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో నిందితులకు నార్కో ఎనాలసిస్ పరీక్షలు నిర్వహించాలంటూ సీబీఐ వేసిన పిటిషన్‌ను విజయవాడ కోర్టు కొట్టివేసింది.. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులకు నార్కో ఎనాలసిస్ టెస్ట్‌లు నిర్వహించాలని.. అందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు చేసింది సీబీఐ.. అయితే, నిందితుల తరపున న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ వాదనలు వినిపించాడు.. ఇరు పక్షాల వాదనలు విన్న విజయవాడ కోర్టు.. సీబీఐ పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా, 2007, డిసెంబర్ 27న హత్యకు గురయ్యారు అయేషా మీరా.. ఈ కేసులో నిందితులుగా ఉన్న కోనేరు సతీష్ సహా ఏడుగురికి నార్కో ఎనాలసిస్ టెస్టులకు అనుమతించాలని సీబీఐ.. కోర్టును కోరింది.. కానీ, కోర్టు పిటిషన్ కొట్టివేయడంతో.. సీబీఐకి చుక్కెదురైనట్టు అయ్యింది.