మా లక్ష్యం ఒక్కటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదు అన్నారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌రావు… స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 64 ఏళ్ల వయస్సులో విజయసాయి రెడ్డి పాదయాత్ర చేశారు. 70 ఏళ్ల వయస్సులో గాజువాక ఎమ్మెల్యే కూడా నిర్వాసితుల కోసం పాదయాత్ర చేశారు.. సీఎం వైఎస్ జగన్ ఇప్పటికి 3 సార్లు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాశారని గుర్తుచేశారు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశామన్న ఆయన.. అయితే, ఢిల్లీలో పోరాటం చేస్తే రెండు పార్టీలు.. ఆ ఆందోళనకు రాలేదని.. అందులో ఒకటి జనసేన, రెండు బీజేపీ అని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ సినిమా షూటింగులతో బిజీగా ఉంటారు… నాదెండ్ల మనోహర్ కైనా స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో అవగాహన ఉండాలని కదా అని హితవుపలికారు. పవన్ కల్యాణ్.. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతాం అంటే స్వాగతిస్తాం.. ఏ పార్టీ వారైనా ఏ వ్యక్తి అయినా స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతాం అంటే మద్దతుగా నిలిస్తామని స్పష్టం చేశారు మంత్రి అవంతి శ్రీనివాసరావు.