విజయవాడ టీడీపీలో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యనని… ఎంపీ నాని అధిష్ఠానానికి చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై నాని అధికారికంగా ఎక్కడా ప్రకటన చేయలేదు. టీడీపీ అధిష్టానం కూడా దీనిపై వ్యాఖ్యానించలేదు. అయితే పార్టీలోని అంతర్గత గొడవలతోనే నాని.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనే…పార్టీ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మేయర్ సీటు విషయంలో కేశినేని నానితో కొందరు నేతలు విభేదించారు. ఈ సందర్భంగా నాని చేసిన…
పాపం….! ఇప్పుడు ఆ ఇద్దరు నేతలను చూస్తున్న పక్కవారు అంటున్న మాట ఇది. కొంతమందికి ఎన్నేళ్ల సీనియార్టీ ఉన్నా పదవులు రావు. ఇంకొందరికి ఎన్ని పదవులు ఇచ్చినా… వాళ్లకి అవి దక్కడం లేదు. ఎక్కడ కాలు పెడితే అక్కడ వాళ్లకి.. వాళ్లతోపాటు మిగిలిన వారికీ పదవులు ఆగిపోతున్నాయట. ఇదేంటి అనుకుంటున్నారా? అయితే ఈ ఐరన్ లెగ్గుల కథ చూడాల్సిందే. శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్‌గా బీరేంద్ర..!కాణిపాకం ఆలయ ఛైర్‌పర్సన్‌గా దయాసాగర్ రెడ్డి భార్య..!స్థానికులు అడ్డం తిరగడంతో ఆగిన ప్రమాణ…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిషత్ ఎన్నికల ఫలితాలు కీలక పరిణామాలకు తెరలేపాయి.. ఇప్పటి వరకు దూరంగా ఉన్న టీడీపీ-జనసేన కలిసి ఆచంట ఎంపీపీ పదవిని టీడీపీ కైవసం చేసుకున్నది. మొత్తం 17 ఎంపీటీసీలు ఉన్న ఆచంటలో టీడీపీ 7 స్థానాలు, వైసీపీ 6 స్థానాలు, జనసేన 4 స్థానాల్లో విజయం సాధించగా.. టీడీపీ, వైసీపీలు ఇద్దరిలో ఎవరు ఎంపీపీ కావాలన్నా.. జనసేన మద్ధతు అవసరంగా మారింది. క్యాంపు రాజకీయాలు షురూ కావడంతో టీడీపీ, జనసేన పార్టీలు తమ ఎంపీటీసీలను…
వైద్య ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్మెంట్కు సిద్ధం అవుతోంది ఏపీ ప్రభుత్వం.. సిబ్బంది కొరతలేని ప్రభుత్వాసుపత్రి దిశగా పటిష్ట చర్యలు తీసుకుంటుంది సర్కార్.. అందులో భాగంగా సుమారు 14,200 పోస్టుల భర్తీకి సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వైద్యకళాశాల, బోధనాసుపత్రుల వరకూ వివిధ రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు.. అక్టోబర్ నుంచి ప్రక్రియను ప్రారంభించి.. నవంబర్ 15 నాటికి ముగించాలన్న ప్లాన్‌కు సీఎం ఆమోదం తెలిపారు.. వైద్య ఆరోగ్యశాఖపై ఇవాళ…
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు 55,323 శాంపిల్స్‌ను పరీక్షించగా, 1,246 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,44,490 కి చేరింది. ఇందులో 20,16,837 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు. 24 గంటల్లో రాష్ట్రంలో 1,450 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇకపోతే, రాష్ట్రంలో ప్రస్తుతం…
ఏపీలో ప్రతిపక్ష రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వద్దనుకుని వదిలేసుకున్న పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతులు కలుపుతున్నాయి. చెట్టపట్టాలేసుకు తిరుగుతున్నాయి. అవసరాలకు తగ్గట్టు పావులు కదుపుతున్నాయి. పక్క పార్టీ పొడే గిట్టని వాళ్లు ఈ పొత్తులకు ఎలా ఒప్పుకున్నారో…. బీజేపీని వదిలి టీడీపీ వెంట జనసేన పరుగులు? 2019 ఎన్నికలకు ముందు ఏపీలో.. టీడీపీ బీజేపీని వదిలేసింది.. జనసేన టీడీపీని వద్దనుకుంది. ఎన్నికల తర్వాత బీజేపీ-జనసేన పొత్తుపెట్టుకున్నాయి. ఇప్పటికీ అదేపొత్తు కొనసాగుతోంది. రాష్ట్రస్థాయిలో ఏదైనా విషయం వస్తే…
అమరావతి : దేశ రాజధాని ఢిల్లీకి సీఎం జగన్ మరోసారి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో ఢిల్లీకి వెళ్ళనున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఎల్లుండి వామపక్ష తీవ్రవాదం పై కేంద్ర హోంశాఖ నేతృత్వంలో సమావేశం జరుగనుంది. కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సెప్టెంబరు 26న ఈ సమావేశం జరుగనుంది. ఇక ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యం లోనే రేపు ఢిల్లీ వెళ్లనున్నారు…
ఆచంట ఎంపీపీ పదవిని టీడీపీ కైవసం చేసుకున్నది. మొత్తం 17 ఎంపీటీసీలు ఉన్న ఆచంటలో టీడీపీ 7 చోట్ల, వైసీపీ 6 చోట్ల, జనసేన 4 చోట్ల విజయం సాధించింది. దీంతో, టీడీపీ, వైసీపీలు ఇద్దరిలో ఎవరు ఎంపీపీ కావాలి అన్నా జనసేన మద్ధతు అవసరంగా మారింది. క్యాంపు రాజకీయాలు షురూ కావడంతో టీడీపీ, జనసేన పార్టీలు తమ ఎంపీటీసీలను రహస్యప్రాంతాలకు తరలించారు. కాగా, ఈ ఎంపీపీ పదవి కోసం టీడీపీ, జనసేన పార్టీలు పొత్తును కుదుర్చుకున్నాయి.…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 55,251 శాంపిల్స్‌ను పరిక్షించగా 1171 మంది పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,43,244కి చేరింది. ఇందులో 20,15,387 మంది కోలుకొని ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. 13,749 కేసులు ప్రస్తుతం యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 11 మంది మృతి చెందినట్టు ఏపీ ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో…