తిరుమలలో నేటితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈరోజు ఉదయం చక్రస్నానం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆలయంలోని అయ్యన్న మహల్‌లో ఈ చక్రస్నాన కార్యక్రమం నిర్వహణ ఉంటుంది. ఇక ఈరోజు జరిగే చక్రస్నానం కార్యక్రమంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ ఎన్వీరమణ పాల్గొననున్నారు. రాత్రి ధ్వజారోహణం కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కరోనా ఆంక్షలు అమలులో ఉండటంతో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
Read: అక్టోబర్ 15, శుక్రవారం దినఫలాలు