ఏపీలో మద్యం విమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో మద్యం వద్దు-కుటుంబం ముద్దు కార్యక్రమంలో చైర్మన్ లక్ష్మణ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో భారీ గా మధ్యం అమ్మకాలు తగ్గాయి. గత రెండు సంవత్సరాలుగా మద్యం అమ్మకాలు 40 శాతం, బీరు అమ్మకాలు 78 శాతం తగ్గాయి అని చెప్పారు. చంద్రబాబు హయంలో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నెలకు ముప్పై నాలుగు లక్షల కేసులు మద్యం అమ్మకాలు జరగ్గా… నేడు 21 లక్షల కేసులకు…
వైసీపీ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతుందనే ప్రచారం నేపథ్యంలో టీడీపీ సైతం అలర్ట్ అవుతోంది. ఈమేరకు ఆపార్టీ తమతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమేననే సంకేతాలను తాజాగా పంపిస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల వెల్లడైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలను ఆపార్టీ వినియోగించుకుంటోంది. ఓవైపు వైసీపీకి ఎంపీపీ పీఠాలు దక్కకుండా చెక్ పెడుతూ వచ్చే ఎన్నికల్లో పొత్తులకు ఇప్పటి నుంచి ప్రణాళికలను రచిస్తోంది. దీనిలో భాగంగానే జనసేన పార్టీని టీడీపీ నేతలు లైన్లో పెడుతున్నట్లు అర్థమవుతోంది. రాష్ట్ర…
ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలను వదిలేసి.. ఇతర విషయాలను ఏపీ టీడీపీ ఎంచుకుంటోందా? డ్రగ్స్ విషయంలో టీడీపీ ఆరోపణలపై జరుగుతున్న చర్చ ఏంటి? చేతిలో ఉన్న అస్త్రాలను విడిచిపెట్టి.. పసలేని వాదన చేస్తున్నట్టు పార్టీలోనే చెవులు కొరుక్కుంటున్నారా? డ్రగ్స్ కేసులో టీడీపీ విమర్శలపై పార్టీలోనే భిన్నమైన చర్చ! ఏపీలో డ్రగ్స్ రాజకీయం రచ్చ రేపుతోంది. ఒక్క గ్రాము మత్తుపదార్ధం దొరకలేదు. ఒక్క వ్యక్తీ ఇక్కడ అరెస్ట్ కాలేదు. కానీ.. 21 వేల కోట్ల డ్రగ్స్ సరఫరాకు ఏపీనే…
ఈనెల 27 న భారత్ బంద్ నిర్వహించాలని జాతీయ రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్.. రైతు, కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ బంద్ కొనసాగనుంది.. ఇందుకు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్ని మద్దతు ప్రటిస్తున్నాయి. మోడీ ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగడుతూ దేశ వ్యాప్తంగా ఈ నెల 27న తలపెట్టిన భారత్ బంద్ చరిత్రాత్మకంగా నిలిచిపోతుందని సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది.. అయితే.. 27న రైతు సంఘాలు…
సీఎం వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు.. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దుపై స్పందించిన ఆయన.. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే బెణకని వైఎస్ జగన్ కాలు.. ఢిల్లీ అంటే బెణికిందా..? అంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఒక పిరికిపంద అని వ్యాఖ్యానించిన ఆయన.. జగన్ చెప్పిన ప్రత్యేక హోదా ఎక్కడ ఉంది..? కేంద్రాన్ని హోదా అడగకుండా తాడేపల్లిలో తల దాచుకున్నారు అంటూ మండిపడ్డారు. ఏ అంశం పైనైనా టీడీపీ…
టీడీపీకి ప్రతిపక్షంలో ఉండటం.. అధికారంలోకి రావడం కొత్తేమీ కాదు. గత కొన్ని దశాబ్ధాలుగా ఆపార్టీ ఇలానే కొనసాగుతూ వస్తోంది. అయితే గతంలో ఎన్నడూలేని విధంగా ఆపార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైన టీడీపీ ఏపీలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తోంది. అయితే గత ఓటమి నుంచి టీడీపీ ఇంకా తేరుకోలేదని ఆపార్టీ నేతల వైఖరి చూస్తుంటేనే అర్థమైపోతుంది. దీనికితోడు టీడీపీ సీనియర్లంతా వరుసబెట్టి గుడ్ బై చెబుతున్నారు.…
రిజిస్ట్రేషన్ శాఖలో తవ్వేకొద్ది అక్రమాలు బయటకొస్తున్నాయి.. ఈ శాఖలో కొందరి ఆగడాలకు హద్దే లేకుండా పోయింది. 2018-19 సంత్సరానికి ముందు జరిగిన రిజిస్ట్రేషన్లలో ఏది ముట్టుకున్నా.. దాని వెనుక ఏదో ఒక అక్రమం బయటపడుతోంది. మొన్నటి వరకు నకిలీ చలానాలు వ్యవహారం దుమారం రేపితే.. ఇప్పుడు ఏకంగా చలనాలే లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు బయట పడింది.ప్రజల సౌకర్యాల కోసం సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేయాలి.. ఇదీ ప్రజలకు ప్రభుత్వ సేవలను దగ్గర చేసేందుకు తీసుకున్న ప్రయత్నాలు. అయితే కొందరు…
వైద్యారోగ్య శాఖపై కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ సర్కార్.. ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ సేవలపై నిషేధం విధించాలని వైఎస్ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ లేదా ప్రైవేట్ ఆస్పత్రుల్లో విధులు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది.. వైద్యారోగ్య శాఖలో కొత్తగా చేపట్టనున్న 14 వేలకు పైగా పోస్టుల భర్తీలో ఈ నిబంధనను కచ్చితంగా అమలయ్యేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు. డీఎంఈ, ఏపీవీవీపీ, డీపీహెచ్ సెంటర్లలో మొత్తంగా 14,037 పోస్టుల భర్తీకి ప్రణాళికలు…
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారనుంది. 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఆదివారం అక్కడక్కడ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పశ్చిమబెంగాల్-ఒడిశా-ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గంటకు 50 -60 కీమీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు…
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటింది వైసీపీ.. ఇప్పటికే మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక పూర్తి కాగా.. నేడు జడ్పీ ఛైర్మన్లు, డిప్యూటీ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఇవాళ ఉదయం పది గంటల లోపు ఇద్దరు కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక కు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.. ఉదయం పది నుంచి ఒంటి గంట లోపు స్క్రూటినీ, నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ, ఎన్నిక ఉండనుండగా.. మధ్యాహ్నం ఒంటి గంటకు కోఆప్షన్ సభ్యుల ప్రమాణస్వీకారం.. మధ్యాహ్నం 3 గంటలకు…