కేఆర్ఎంబీకి ఏపీ ప్రాజెక్టుల అప్పగింత.. ఉత్తర్వులు జారీ.. కానీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇవాళ్టి నుంచి అమల్లోకి రావాల్సిన సమయంలో.. ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించడంపై తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేసింది.. అయితే, గెజిట్ ప్రకారం బోర్డులకు ప్రాజెక్టుల అప్పగింతపై స్పష్టత ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది… అయితే, తన ప్రాజెక్టులను తెలంగాణ అప్పగించిన తర్వాతనే ఈ జీవో అమల్లోకి తేవాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.. నోటిఫికేషన్ లోని రెండో షెడ్యూలు ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వే, రివర్ స్లూయిస్ తో పాటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రినీవా, మచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలను అప్పగింతకు సిద్ధమని ప్రకటించింది. అయితే, తెలంగాణ కూడా ప్రాజెక్టులను స్వాధీనం చేస్తేనే తాము కూడా కేఆర్ఎంబీకి అప్పగిస్తామని స్పష్టం చేసింది.
నోటిఫికేషన్ ప్రకారం ఇవాళ్టి నుంచే ప్రాజెక్టులను అప్పగించేందుకు అంగీకారం తెలియచేస్తున్నట్టు తెలిపింది ఏపీ ప్రభుత్వం.. ప్రాజెక్టుల్లోని భవనాలు, ఇతర కట్టడాలు, యంత్ర సామాగ్రి ఎక్కడివక్కడ ప్రాతిపదికన అప్పగింతకు సిద్ధమని ఉత్తర్వుల్లో పేర్కొంది.. శ్రీశైలం ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టుపై కూడా నిర్ణయం తీసుకోవాలని కేఆర్ఎంబీని కోరిన ఏపీ సర్కార్.. శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చే ప్రవాహాలను ప్రభావితం చేసే ప్రాజెక్టుగా జూరాలను కూడా కేఆర్ఎంబీ తన స్వాధీనంలోకి తీసుకోవాలని కోరింది. ప్రస్తుతం రెండు రాష్ట్రాలూ నిర్మిస్తున్న ప్రాజెక్టులు పూర్తైన తర్వాత వాటిని కూడా తమ ఆధీనంలోకి తీసుకోవాలని కోరింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
Also Read
తాజావార్తలు
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
-
Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
-
Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!