తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు నిత్యం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. చాలామంది భక్తులు తిరుపతిలోని అలిపిరికి చేరుకొని అక్కడి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. ఒకసారి కాలినకడన ఎక్కడమే కష్టమైన ఈ రోజుల్లో ఓ భక్తులు 300 సార్లు అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకొని లిమ్కాబుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కాడు. 1996లో మొదటిసారి తిరుమలకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కొండకు చేరుకున్న శ్రీకాకుళానికి చెందిన మహంతి శ్రీనివాసరావు…
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డ్రగ్స్ వ్యవహారంపై ఓ ట్వీట్ చేశారు. గుజరాత్లో తీగలాగితే ఏపీలో డొంక కదిలిందని, రూ.72 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను తాలిబన్లతో మాట్లాడి ఏపీకి తెచ్చిన డ్రగ్స్ డాన్ ఎవరు అంటూ అంటూ నారాలోకేష్ ట్వీట్ చేశారు. తాలిబన్ల డ్రగ్స్ కి తాడేపల్లి ప్యాలస్ కి ఉన్న లింకేంటి? లిక్కర్ మాఫియాతో మొదలెట్టి ఇప్పుడు ఏపీని ఏకంగా డ్రగ్స్ డెన్ గా మార్చేశారని నారా లోకేష్ ట్వీట్…
ప్రధాని నరేంద్రమోదీ ఆస్తులు గతేడాది కంటే కాస్త పెరిగాయి. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ 3.7కోట్లకు చేరింది. ప్రతి ఏడాది ఆస్తులు, అప్పులు వివరాలను వెల్లడిస్తున్న మోడీ.. ఈ ఏడాది మార్చి 31 నాటి వివరాలను బహిర్గతం చేశారు. 2020లో 2.85కోట్లు ఉండగా.. ప్రస్తుతానికి ఆయన ఆస్తులు 22 లక్షలు పెరిగాయి. ప్రభుత్వం నుంచి పొందే రూ. 2లక్షల జీతమే ప్రధానికి ముఖ్య ఆదాయ వనరుగా ఉంది. ఆ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టడం, వాటివల్ల వచ్చే…
తెలుగు రాష్ట్రాలకు వాన గండం ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొన్ని గంటల్లో తుఫానుగా మారబోతోంది. దీనికి గులాబ్ అని నామకరణం చేశారు. పశ్చిమ దిశగా పయనిస్తున్న ఈ తుఫాను ఈరోజు సాయంత్రం విశాఖపట్టణం-గోపాల్‌పూర్‌ల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ తుఫాను పలు రాష్ట్రాలపై ప్రభావం చూపనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశాతోపాటు ఏపీ, తెలంగాణ, బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు అధికారులు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని…
న్యూ ఢిల్లీ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆదిత్య నాథ్ దాస్ ను నియమిస్తూ… ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్య నాథ్ దాస్ సెప్టెంబర్ 30 న పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని.. ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేబినెట్ మంత్రి హోదాలో న్యూఢిల్లీ లోని ఏపీ భవన్ కేంద్రంగా ఆదిత్య నాథ్ దాస్ పని చేయనున్నారని……
ఏపీలో వైసీపీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్తోందా? ఇప్పటి నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందా? ముందుగా అనుమానాస్పద అధికారులపై ఫోకస్ పెట్టిందా? ఆఫీసర్ల చెక్‌లిస్ట్ సిద్ధం చేస్తోందా? ఆ జాబితాలోకి వచ్చే అధికారులను ఏం చేస్తారు? సచివాలయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? అధికారులకు ఉన్న రాజకీయ ఉద్దేశాలపై ఆరా..!? ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉన్నా.. క్రమంగా ఎలక్షన్ మూడ్‌లోకి తీసుకెళ్తున్నారు సీఎం జగన్. మంత్రులు మొదలుకుని.. క్షేత్రస్థాయిలోని పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే సమాయత్తం…
ఆంధ్రప్రదేశ్‌లో కేబినెట్లో భారీ మార్పులు ఉంటాయనే ప్రచారం గత కొంతకాలంగా సాగుతూనే ఉంది.. అయితే, ఆ వ్యాఖ్యలకు బరింత బలాన్ని ఇచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేవారు మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి… ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు ఉంటాయని తెలిపారు. మంత్రి వర్గంలో వందశాతం కొత్తవారినే తీసుకుంటారని సీఎం వైఎస్ జగన్ చెప్పారని తెలిపిన ఆయన.. విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎం జగన్‌కు చెప్పానని పేర్కొన్నారు.. ఇక,…
బంగాళాఖాతంలో మరికొద్ది గంటల్లో తుఫాన్ గా మారనుంది తీవ్ర వాయుగుండం. పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో గంటకు 17కి.మీ వేగంతో కదులుతున్న తీవ్ర వాయుగుండంతుఫాన్ గా మారి రేపు సాయంత్రం కళింగపట్నం-గోపాల్ పూర్ మధ్య తీరం దాటుతుందని హెచ్చరికలు జారీ చేసారు వాతావరణ అధికారులు. గోపాల్పూర్ (ఒడిశా) కి తూర్పు-ఆగ్నేయంగా 410 కి.మీ &కళింగపట్నం (ఆంధ్రప్రదేశ్)కి తూర్పు-ఈశాన్యంలో 480 కి.మీ.దూరంలో కొనసాగుతుంది తీవ్ర వాయుగుండం. అయితే ఇప్పటికే ఉత్తరాంధ్రలో దాని ప్రభావం మొదలైంది. విశాఖలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు ప్రతీ రోజూ వెయ్యికి పైగానే నమోదు అవుతూ వస్తున్నాయి.. అయితే, గత బులెటిన్ కంటే.. ఇవాళ కాస్త తక్కువ కేసులే వెలుగుచూశాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 55,307 శాంపిల్స్ పరీక్షించగా.. 1,167 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఏడుగురు కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 1,487 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది…
చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి… ఎంపీటీసీ ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటగా.. ఎంపీపీ ఎన్నికల విషయంలో.. స్థానిక ఎమ్మెల్యే రోజాకు సెగ తగిలింది.. నిండ్ర మండలం.. ఎంపీపీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రోజా నిర్ణయించిన అభ్యర్థికి స్థానిక నేతలు చక్రపాణిరెడ్డితో పాటు అతడి తమ్ముడు కూడా మద్దతు ఇవ్వలేదు.. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఎమ్మెల్యే రోజా.. స్థానిక ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఇలా చేయడం సరికాదన్నారు.…